Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ ఐడియా..రియాకు మించి !!

By:  Tupaki Desk   |   7 April 2020 1:30 PM GMT
కేజ్రీవాల్ ఐడియా..రియాకు మించి !!
X
కరోనాలో అతి పెద్ద విజయం కరోనా చైన్ బ్రేక్ చేయడం, రెండో పెద్ద విజయం... సోకిన వారికి చికిత్స చేయడం. అవును ఈ రెండే అతి కీలకమైన విషయాలు. దీనికోసం లాక్ డౌన్ అస్త్రాన్ని వాడకుండా దక్షిణ కొరియా సూపర్ సక్సెస్ అయ్యింది. టెక్నాలజీలో చాలా ముందుండే ఆ దేశంలో మనం వాడే ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేస్తుంది. ఎల్ జీ, శాంసంగ్ హ్యుందాయ్ - చివరకు మన మెట్రో కోచ్ లు కూడా కొరియావే. అందుకే ప్రపంచంలోనే కరోనా టెస్ట్ కిట్స్ తయారు చేయడంలో ఆ దేశం నెం.1 ప్లేసులో ఉంది. శరవేగంగా టెస్టులు జరిపి వారందరినీ ఒక చోటకు చేర్చి చికిత్స చేస్తోంది కొరియా ప్రభుత్వం. దీనిని మరింత మెరుగు పరిచి ఢిల్లీలో అమలు చేసే దిశలో పయనిస్తున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్

ఢిల్లీ కి మర్కజ్ మసీద్ లో జరిగిన తబ్లిగి జమాత్ పెద్ద థ్రెట్ గా మారింది. అందుకే అందుకే కేజ్రీవాల్ దీనిని అరికట్టడానికి 5T మార్గాన్ని ఎంచుకున్నారు. అవేంటో చూద్దాం.

టి1. టెస్టులు. పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం. తబ్లిగి జమాత్ సంస్థ ఉన్న నిజాముద్దీన్ ప్రాంతంతో పాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం

టి2. ట్రేస్. టెస్టుల్లో కరోనా సోకిన వారిని కలిసిన వారందరనినీ ట్రేస్ చేసి క్వారంటైన్ చేయండి.

టి3. ట్రీట్ మెంట్. పాజిటివ్ కేసులకు యుద్ధ ప్రాతిపదికన ఆస్ప్రతులు గుర్తించి తగిన చికిత్స చేయడం.

టి4. టీంవర్క్. పోలీసులు - డాక్టర్లు - నర్సులు - వైద్యాధికారులతో కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ కోఆర్డినేషన్ లోపం రాకుండా చూడటం. దీనికి ప్రత్యేక టీంవర్క్ క్రియేట్ చేసే బృందాన్ని ఏర్పాటుచేయడం.

టి5. ట్రాకింగ్. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను పరిశీలించి ఫలితాలను బట్టి ఎప్పటికపుడు మార్పులు చేసుకోవడం - ఈ ట్రాకింగ్ ద్వారా ప్రభుత్వం నిరంతరం అలర్ట్ గా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

కేజ్రీవాల్ దేశంలోనే ప్రభుత్వ ఆస్పత్రి వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తి. గత పాలనలో ఆస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దారు. అదిప్పుడు ఎంతో ఉపయుక్తంగా మారింది. దానిని విజయవంతంగా సాధించిన బృందం ఇపుడు కేజ్రీవాల్ కొత్త ఐడియాను కూడా అంతే విజయవంతం చేయగలదంటున్నారు.