Begin typing your search above and press return to search.
జగన్ కి భారీ షాక్ ఇచ్చేలా మాస్టర్ ప్లాన్... ?
By: Tupaki Desk | 12 Jan 2022 1:30 AM GMTఏపీ రాజకీయాల్లో జగన్ ఇంతటి వాడు కావడానికి కారణం ఆ నాలుగు జిల్లాలే. ఆయన సొంత గడ్డ రాయలసీమ మద్దతు జగన్ కి ఎపుడూ ఒక రేంజిలో ఉంటుంది. వైఎస్సార్ ఇమేజ్ తో పాటు యువనేతగా జగన్ కి ఉన్న గ్లామర్ వెరసి 2014, 2019 ఎన్నికల్లో రాయలసీమ వైసీపీ వైపే ఉంది. 2014లో మెజారిటీ సీట్లను వైసీపీ గెలుచుకుంటే 2019 వచ్చేనాటికి మొత్తం సీట్లలో కేవలం మూడు తప్ప అన్నీ వైసీపీ వశమయ్యాయి. ఇందులో కర్నూల్, కడప జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి పారేసింది ఫ్యాన్ పార్టీ.
ఇక చిత్తూరు జిల్లాలో అయితే చంద్రబాబు ఒక్కరే కుప్పంలో గెలిచారు. మరి అంతటి ఘనమైన రికార్డు ఇప్పటిదాకా మరే రాజకీయ పార్టీకీ లేదు. అయితే ఇది జగన్ మీద ఉన్న ప్రేమకు అభిమానానికి జన నీరాజనం పట్టిన అరుదైన సందర్భంగా చెప్పుకోవాలి. ఇంతకంటే పీక్స్ కి వైసీపీ చేరలేదు కూడా. మొత్తం 52 సీట్లలో 49 గెలవడం అంటే ఆషామాషీ కాదు.
ఇక జగన్ అయిదేళ్ల పాలన చూసిన తరువాత 2024 ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాలు మళ్ళీ ఆయనకే జై కొడతాయా అంటే చెప్పలేమనే అంటున్నారు. బలమైన రెడ్డి సామాజికవర్గం మా జగన్ సీఎం కావాలని నాడు కాలికి బలపం కట్టుకుని ఊరూ వాడా తిరిగింది. అయితే జగన్ సీఎం అయ్యాక వారికి అనుకున్న తీరున రాజకీయ అవకాశాలు రాలేదు అన్న బాధ ఉంది.
సామాజిక సమీకరణల పేరిట జగన్ చేసిన ప్రయోగాలతో వారు బాగా సైడ్ అయిపోయారు. మరో వైపు చూస్తే నామినేటెడ్ పదవులు కానీ వివిధ కార్పోరేషన్ల పదవులు కానీ వారికి దక్కలేదన్న బాధ ఉంది. లోకల్ బాడీస్ ఎన్నికలలో చూసుకున్న సామాజిక సమీకరణలనే జగన్ నమ్ముకున్నారు.
దాంతో జగన్ కి అండగా ఉన్న రెడ్లలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్న ప్రచారం అయితే గట్టిగా ఉంది. దీంతో ఈసారి సీమలో జగన్ కంచుకోటలను బద్ధలు కొట్టాలని విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టేశాయి. జనసేన నుంచి చూసుకుంటే పవన్ జగన్ ను ఆయన సొంత ఇలాకా నుంచే దెబ్బ తీయాలనుకుంటున్నారుట.
అందుకే వచ్చే ఎన్నికల్లో సీమ నుంచే సమరశంఖారావాన్ని పూరించాలని చూస్తున్నారని టాక్. పవన్ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయడం ద్వార సీమలో జనసేన ప్రభావాన్ని చాటాలనుకుంటున్నారుట. అక్కడ నుంచి 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఇక సీమ జిల్లాలో బలిజలు మంచి సంఖ్యలో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఎక్కువ.
దాంతో తాను వచ్చేసారి జరిగే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీలో ఉండడం ద్వారా సామాజిక సమీకరణల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలని పవన్ చూస్తున్నారుట. అదే జరిగితే వైసీపీకి అక్కడ ఇబ్బందులు తప్పవని విశ్లేషిస్తున్నారు. మరో వైపు టీడీపీతో జనసేన పొత్తు ఉంటే కనుక రెండు పార్టీల బలంతో వైసీపీకి ఎదురీత తప్పదని కూడా అంటున్నారు. చూడాలి మరి దీనికి పై ఎత్తులు వేసేలా వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో.