Begin typing your search above and press return to search.

అదే పనిగా హస్తప్రయోగం.. చావు అంచుల వరకూ వెళ్లాడు!

By:  Tupaki Desk   |   15 April 2022 4:16 AM GMT
అదే పనిగా హస్తప్రయోగం.. చావు అంచుల వరకూ వెళ్లాడు!
X
స్వయం తృప్తి కోసం చేసే హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిది అని పలు పరిశోధనల్లో తేలింది. కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటితే మనకే ప్రమాదం.. చివరకు మరణం కూడా సంభవించవచ్చు. స్విట్జర్లాండ్ కు చెందిన ఓ యువకుడికి ఎదురైన పరిస్థితి ఇప్పుడు అతడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది.

20 ఏళ్ల యువకుడు ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో హస్త ప్రయోగం చేస్తూ టైంపాస్ చేశాడు. ఉద్వేగం ఆపుకోలేక కొద్దిసేపటి తర్వాత మరోసారి చేశాడు. కానీ అది ఎఫెక్ట్ అయ్యింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యింది. ఆ తర్వాత చాతినొప్పి వచ్చింది. ఏదో తేడా కొడుతోందని భావించి అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. వైద్యులు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో పెట్టారు. కృత్రిమ శ్వాసం అందించారు.

హస్తప్రయోగం చేస్తున్న సమయంలో ఈ సమస్య వచ్చిందని అతడు వైద్యులకు తెలిపాడు. పరీక్షల సమయంలో అతడి ముఖం వాచిపోయింది. ఊపిరితిత్తుల్లో గాయాన్ని గుర్తించారు. ఈ జబ్బు కఠినమైన వ్యాయామం వల్ల వస్తుందని తేలింది.

ఐసీయూలోనే ఇతడు మూడు రోజుల పాటు చికిత్స పొందాల్సి వచ్చింది. దాదాపు చావు అంచుల వరకూ వెళ్లొచ్చాడు.

బాధితుడికి స్పాంటేనియస్ న్యుమోమెడియాస్టినమ్ ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లోని గాలి పక్కటెముకల్లోకి చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గాలి పుర్రె వరకూ వ్యాపించి ముఖం వాపు వస్తుంది. అయితే లక్కీగా త్వరగా ఆస్పత్రిలో చేరడంతో అతడు బయటపడ్డాడు.

ఛాతి, ఊపిరితిత్తుల సంచుల మధ్య ఖాళీలో గాలి ఉన్నట్లు కనిపించింది. అదే ఛాతి నొప్పికి కారణమైనట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఆస్తమా కూడా ఉండడంతో హస్త ప్రయోగం చేసేసరికి ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు.