Begin typing your search above and press return to search.
ఆఖరికి అగ్గిపెట్టే ధర కూడా పెరిగింది?
By: Tupaki Desk | 24 Oct 2021 5:35 AM GMTకాదేది ‘పెంచడానికి’ అనర్హం అన్నట్టుగా మోడీ సార్ ధరా‘ఘాతం’ చూపిస్తున్నారు. అగ్గిపుల్ల సబ్బుబిల్ల, గ్యాస్ బండ, పెట్రో మంట, నిత్యావసరాల తంటా.. ఇలా దేశమంతా ఇప్పుడు ఒకటే బాదుడు.. కరోనా కల్లోలంతో ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా మోడీ సార్ వీర బాదుడు బాదేస్తున్నాడు. సామాన్యుడి నడ్డి విరిచేలా ధరలు పెంచేస్తున్నాడు.
మోడీ ధరలు బాదుడుకు సామాన్యులు విలవిలాడుతున్నారు. పెట్రోల్ ధరలు రూ.110 దాటేశాయి.. వంట నూనె 200కు చేరువ అవుతోంది. ఇక వంట గ్యాస్ సిలిండర్ 1000కి చేరడం జరిగిపోయింది. దేశప్రజలంతా మొత్తుకుంటున్నా కూడా ధరలను తగ్గించేందుకు మోడీ సార్ అస్సలు సాహసించడంలేదు. ముఖ్యంగా సామాన్యుడికి నిత్య అవసరం అయిన పెట్రోల్ రేటు రూ.100కు చేరువ అవ్వడం ప్రజల జేబును ఖాళీ చేసేలా చేస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత తక్కువగా రూ.1.45కే లీటర్ పెట్రోల్ అమ్ముతున్న దేశం ‘వెనిజుల’ అని అక్కడికి పదండి ముందుకు అని సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేస్తున్నారు.‘రూ.500 పట్టుకెళ్లి ట్యాంకు ఫుల్ గా ’ పెట్రోల్ తెచ్చుకుందాం అని సెటైర్లు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే పెట్రోల్ పై భారత, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించాలనే డిమాండ్ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరలు ఇండియాలోనే అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వివిధ దేశాల పెట్రోల్ ధరలను వేలెత్తిచూపిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆఖరుకు మోడీ సార్ ధరాఘాతానికి ‘అగ్గిపెట్టె’ను కూడా వదల్లేదని సెటైర్లు పడుతున్నాయి. దేశంలో ధర పెరగని వస్తువంటూ లేదని తేలిపోయింది. చివరకు అగ్గిపెట్టే ధర కూడా పెరగడంతో మోడీ సార్ వీరబాదుడుకు అందరూ కుయ్యో మొర్రో అంటున్నారు.
14 ఏళ్లుగా ఒక్కరూపాయిగా ఉన్న అగ్గిపెట్టె ధర డిసెంబర్ 1 నుంచి రూ.2 చేయాలని తయారీదారులు నిర్ణయించారు. రూ.425గా ఉన్న రెడ్ ఫాస్పరెస్ ధర రూ.810కి, రూ.58గా ఉన్న మైనం రూ.80కి పెరగడంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో అగ్గిపెట్టె ధర కూడా పెంచక తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. చివరి సారి 2007లో అగ్గిపెట్టె ధర అర్థరూపాయి పెరిగింది. ఇప్పుడు రూ.2 రూపాయలకు చేరుతోంది.మోడీ సార్ హయాంలో ఇది చాలా తక్కువ రేటే.. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.