Begin typing your search above and press return to search.

కృష్ణ మందిరం : మథురా సివిల్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   24 Dec 2022 5:00 PM GMT
కృష్ణ మందిరం :  మథురా సివిల్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు
X
ఇప్ప‌టికే మోడీ హ‌యాంలో అయోధ్యలో మ‌సీదు స్థానంలో రామమందిరం నిర్మిస్తున్నారంటూ.. మైనారిటీలు గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే.. ఇప్పుడు అదే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో మ‌సీదు కూల్చేసి శ్రీకృష్ణ మందిరం క‌ట్టుకునేందుకు మ‌రో కోర్టు తీర్పు వెలువ‌రించింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇది సంచ‌నంగా మారింది.

శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర సివిల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిజానిజాలు వెలికి తీసే బాధ్యతను భారత పురావస్తుశాఖ అధికారులకు అప్పగించింది. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశంగా భావిస్తున్న షాహి ఇద్గా మసీదులో జనవరి 2 నుంచి పురావస్తుశాఖ అధికారులు సర్వే చేయాలని స్థానిక కోర్టు తీర్పునిచ్చింది.

సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 20న కోర్టుకు సమర్పించాలని సూచించింది. మథురలో 17వ శతాబ్దానికి చెందిన షాహి ఇద్గా మసీదును కత్రా కేశవ్‌ దేవ్‌ ఆలయాన్ని కూల్చి నిర్మించారని ఆ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా.. మథురా సివిల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

13.37 ఎకరాల్లో విస్తరించి ఉన్న కత్రా కేశవ్‌ దేవ్‌ ఆలయ ప్రాంగణంలో మసీదును నిర్మించారని కోర్టుకు తెలిపారు. 1669-1770 మధ్య మెుఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో.. శ్రీకృష్ణుడి జన్మ భూమిలో మసీదు నిర్మాణం జరిగిందని కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం మసీదులో సర్వేకు ఆదేశించింది. మ‌సీదు అక్ర‌మ నిర్మాణమ‌ని తేలితే.. కృష్ణ మందిరం నిర్మించుకునేందుకు అనుకూలంగా తీర్పు ఇస్తామ‌ని తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.