Begin typing your search above and press return to search.
పెళ్లి పేరుతో రూ. 21 లక్షలు టోకరా.. ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది..!
By: Tupaki Desk | 7 Dec 2022 11:21 AM GMTఒకప్పుడు పెళ్లి వ్యవహారాన్ని మన కుటుంబ పెద్దలు పెళ్లిళ్ల పేరయ్యలకు అప్పగించే వాళ్లు. వీళ్లు అబ్బాయి తరఫున.. అమ్మాయి తరుపు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఇరువురి పెద్దలతో మాట్లాడి పెళ్ళిళ్ళు ఖాయం చేసేవాళ్లు. అయితే ప్రస్తుతం జమానా మారిపోయింది. అంతా ఆన్ లైనే. ఏదైనా క్షణాల్లో జరగాల్సిందే. పెళ్లిళ్లు కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు.
ఫోన్లలోనే పెళ్లి సంబంధాలు మాట్లాడుకొని.. వీడియో కాల్స్ లో వరుడు.. వధువుల చూసుకొని పెళ్లిపీఠ లెక్కుతున్నారు. తీరా శోభనం గట్రా అపోయాక అసలు బండారం బయటపడుతోంది. వరుడో లేక వధువో ఎవరో ఒకరు నకిలీ వివరాలతో మోసం చేసి పెళ్లి చేసుకున్నారనే ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ వెలుగు చూస్తున్నాయి.
తాజా చెన్నై నగరానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి పేరుతో 21 లక్షల రూపాయాల దాకా మోసపోయాడు. అయితే ఈ ఘటనలో పెళ్లి కూతురు పేరుతో మోసం చేసింది మగవాడేనని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ విషయం తెలుసుకొని ప్రతీ ఒక్కరూ అవాక్కవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి వయస్సు(39) దాటి పోతుండటంతో మ్యాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేయించాడు. ఈ క్రమంలోనే అతడికి ధాతాత్రి శ్రీనివాస్(47) అనే వ్యక్తి పెళ్లి కూతురిగా నమ్మిస్తూ ఫొటోలు పంపించాడు. ఇది నమ్మిన 39 ఏళ్ళ వ్యక్తి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం షూరు చేశాడు. కొద్దిరోజులు వీరి మధ్య సంభాషణలు నడిచాయి.
ఈ క్రమంలోనే శ్రీనివాస్ (పెళ్లి కూతురు) తన తల్లి ఆస్పత్రిలో ఉందని ఆపరేషన్ నిమిత్ం అత్యవసరంగా డబ్బులు కావాలని కోరాడు. అతడి మాటలు నిజమేనని నమ్మి 39 ఏళ్ళ వ్యక్తి డబ్బులను శ్రీనివాస్ ఖాతాకు బదిలీ చేశాడు. ఇలా ఐదు నెలల కాలంలోనే ఏకంగా 21 లక్షలు పొగొట్టుకున్నాడు.
అయితే ఇంత డబ్బు ఇచ్చినా మళ్లీ మళ్లీ డబ్బులు అడుగుతుండటంతో ఆ పెళ్లి కూతురుపై 39 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. పెళ్లి కూతురి పేరుతో మోసం చేస్తున్న శ్రీనివాస్ అని తేలడంతో పోలీసులు సహా ఆ 39 ఏళ్ల వ్యక్తి షాక్ కు గురయ్యాడు.
ఆ తర్వాత శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. ముందు వెనుక చూసుకోకుండా మ్యాట్రిమోనియల్ సైట్లను గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుందని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.