Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై మ‌త్త‌య్య కేసు పెట్టాడు

By:  Tupaki Desk   |   10 Jun 2015 2:45 PM GMT
కేసీఆర్‌పై మ‌త్త‌య్య కేసు పెట్టాడు
X
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కేసుల ప‌ర్వం సాగుతోంది. మిగిలిన కేసుల‌న్నీ ఒక ఎత్తు అయితే.. రేవంత్ కేసులో ఏ4గా ఉన్న మ‌త్త‌య్య తెలంగాణ సీఎం కేసీఆర్ పై పెట్టిన కేసు ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య‌వాడ‌లోని స‌త్య‌నారాయ‌ణ పురం పోలీస్ స్టేష‌న్‌లో తెలంగాణ సీఎంపై ఆయ‌న ఫిర్యాదు చేశారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ స‌న్ నుంచి కోటి రూపాయిల మొత్తాన్ని తీసుకొని ఆ ప‌ద‌విని పొందార‌ని ఆరోపించారు. త‌న‌కు తెలంగాణ పోలీసుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌.. త‌న సోద‌రుడ్ని తెలంగాణ పోలీసులు కొట్టార‌న్నారు. వీడియోలు టీవీలో ప్ర‌సార‌మైతేనే.. దిక్కులేకుండా పోయి.. అడ్డ‌దిడ్డంగా మాట్లేస్తుంటే.. ఇచ్చారో.. ఇవ్వ‌ని విష‌యాన్ని మ‌త్త‌య్య వ‌చ్చి ఆరోపిస్తే.. పోలీసులు ఎలా న‌మోదు చేస్తార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు.

మ‌త్త‌య్య ఇచ్చిన ఫిర్యాదులో.. త‌న కుటుంబ స‌భ్యుల‌ను అక్ర‌మంగా నిర్బంధించార‌ని ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేసులో త‌న‌ను ఇరికించాల‌ని చూస్తున్నార‌ని.. ఫోన్లో బెదిరించార‌ని పేర్కొన్నారు. అయినా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి డ‌బ్బులు తీసుకున్నార‌ని.. ప‌ద‌వి పొందిన నెల‌ల త‌ర్వాత విజ‌య‌వాడ‌కు వ‌చ్చి మ‌త్త‌య్య ఫిర్యాదు చేయ‌టం ఏమిటి? ఇంత‌కాలం ఏం చేస్తున్న‌ట్లు..?