Begin typing your search above and press return to search.
సరే..మీ పార్టీ సినీ స్టార్స్ చేత స్నానం చేయిస్తారా యోగీ?
By: Tupaki Desk | 6 March 2019 11:49 AM GMTకొన్నిసార్లు గొప్పలు కూడా చెప్పే మాటలు భలేగా ఉంటాయి. మోడీ సర్కారు గొప్పతనం గురించి చెప్పేందుకు బీజేపీ నేతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మామూలుగా జరిగిన వైనాన్ని గొప్పలు చెప్పుకోవటానికి పడుతున్న తాపత్రయం ఇప్పుడు వేలెత్తి చూపేలా మారింది. మోడీ భజనలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
2013లో ప్రయాగరాజ్ లో జరిగిన కుంభమేళాకు హాజరైన మారిషస్ ప్రధాని ప్రవీంద్ జుగ్నాద్ గంగకు వచ్చినా.. అక్కడి దుర్గంధం చూసి స్నానం చేయకుండా వెళ్లిపోయారని.. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కుంభమేళ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్నానం చేశారన్నారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో అటు కేంద్రం.. ఇటు యూపీ సర్కారు తీసుకున్న చర్యలతో గంగలో కాలుష్యం తగ్గిందని.. అదే విషయాన్ని మారిషస్ ప్రధాని వ్యాఖ్యానించినట్లుగా చెప్పారు. ఈ ఏడాది జరిగిన కుంభమేళ కార్యక్రమంలో తొలిసారి 3200 మంది ఎన్ ఆర్ ఐలు పాల్గొన్నట్లు చెప్పారు. 70 దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. యోగి మాటల్ని జాగ్రత్తగా చూస్తే గంగలో కాలుష్యం తగ్గిందన్నారే కానీ.. పూర్తి తొలగించలేకపోయిన వైనాన్ని ఒప్పుకోవటం కనిపిస్తుంది. ఐదేళ్లు అధికారంలో ఉండి.. వందల కోట్లు ఖర్చు పెట్టి కాలుష్యాన్ని తగ్గించారే కానీ.. అదెంత అన్నది చెప్పలేని పరిస్థితి. అంతేనా.. మారిషస్ ప్రధాని స్నానం చేసిన విషయాన్ని గొప్పగా చెబుతున్న యోగి మాష్టారు.. నిజంగా అంత పరిశుభ్రంగా గంగనది ఉంటే.. బీజేపీలోని సినీ స్టార్స్ (హీరోలు.. హీరోయిన్లు) వరుస పెట్టి స్నానాలు చేయిస్తే.. అంతో ఇంతో నమ్మొచ్చు. ఆ పని చేసిన తర్వాత యోగి గొప్పలు చెబితే బాగుంటుంది.