Begin typing your search above and press return to search.
ఛోటా రాజన్ ను తెచ్చేశారు..గంగిరెడ్డే మిగిలాడు
By: Tupaki Desk | 7 Nov 2015 5:50 AM GMT 22 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ తప్పించుకున్న తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ను భారత్ కు తెచ్చారు.. అయితే, ఏడాదిగా విదేశాల్లో పోలీసుల అదుపులోనే ఉన్నా రకరకాల కారణాలతో భారత్ కు రాకుండా తప్పించుకుంటున్న ఎర్రచందనం డాన్ గంగిరెడ్డిని మాత్రం ఏపీ పోలీసులు రాష్ట్రానికి రప్పించలేకపోయారు. అయితే.. మారిషస్ పోలీసుల అదుపులో ఉంటూ ముప్పతిప్పలు పెడుతున్న గంగిరెడ్డిని అప్పగించేయాలని చివరకు అక్కడి పోలీసులు నిర్ణయించడంతో ఆయన్ను త్వరలో ఏపీకి తెస్తారని సమాచారం.
ఎర్రచందనం బడా స్మగ్లర్ గంగిరెడ్డి ఏపీకి రావడానికి రోజులు దగ్గరపడుతున్నాయి. భాష రాదని.. అనారోగ్యమని.. ఇలా సవాలక్ష వంకలతో మారిషస్ జైలు నుంచి బయటకు అడుగుపెట్టకుండా అల్లరి పెడుతున్న ఈ మర్యాద రామన్న ను ఏపీ పంపించేయడానికి మారిషస్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. 2012 నుంచి విదేశాల్లో తలదాచుకుంటున్న గంగిరెడ్డి ఈ ఏడాది జనవరిలో దొంగ పాస్ పోర్టుతో దుబాయి పారిపోయే ప్రయత్నంలో మారిషస్ లో దొరికిపోయాడు. అప్పటి నుంచి ఏపీ, భారత్ పోలీసు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మారిషస్ కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తూ గంగిరెడ్డి తప్పించుకుంటూ వస్తున్నాడు. అయితే, మారిషస్ కోర్టు ఆ పిటిషన్నన్నీ కొట్టేసింది. ఆయన్ను భారత్ కు అప్పగించడానికి సంబంధించి డిసెంబరు 9న ఇంకో కేసు విచారణకు రానుంది. ఆలోగా ఇక్కడి అధికారులు వెళ్లి గంగిరెడ్డి మొత్తం చరిత్రను, ఆధారాలను కోర్టుకు ఇచ్చి ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తారని తెలుస్తోంది. మారిషస్, ఇంటర్ పోల్ అధికారులతో ఇప్పటికే చర్చించారని సమాచారం. న్యాయపరంగా అక్కడి ప్రభుత్వ పరంగానూ గంగిరెడ్డిని ఏపీకి అప్పగించేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.