Begin typing your search above and press return to search.
మారిషస్ ప్రధానికి హైదరాబాద్ లో ఆపరేషన్
By: Tupaki Desk | 26 Feb 2016 4:52 AM GMTమన గొప్ప మనకు పెద్దగా తెలీదు. పక్కనున్నోడు ఎవరైనా చెబితే కానీ అర్థంకాని పరిస్థితి. ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురైతే.. వెంటనే విదేశాలకు వెళ్లటం జరుగుతుంటుంది. కానీ.. ఇతర దేశస్తులు చాలామంది మన దేశానికి చికిత్స కోసం వస్తుంటారు. తాజాగా అలా వచ్చారో విదేశీ అతిధి. అది కూడా అల్లాటప్ప వ్యక్తి కాదు. ఏకంగా ఒక దేశానికే ప్రధాని కావటం గమనార్హం.
తన కంటికి పరీక్షలు చేయించుకొని.. శస్త్రచికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ కు వచ్చారు మారిషస్ ప్రధాని అనిరుద్ జగన్నాథ్. సోమాజీగూడలోని మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తన కంటి పరీక్షలు.. చికిత్స కోసం ఆయన హైదరాబాద్ రావటం విశేషం.
ఇంతకీ మారిషస్ ప్రధానికి ఎదురైన కంటి సమస్య ఏమిటంటే.. ఆయన రెండు కళ్లల్లో గ్లకోమా.. కాటరాక్ట్ ఉండటంతో ఆయన ఆపరేషన్ క్లిష్టంగా మారినప్పటికీ.. విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లుగా మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్ కో ఛైర్మన్.. చీఫ్ సర్జన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఏమైనా ఒక దేశ ప్రధాని శస్త్ర చికిత్స కోసం భారతదేశాన్ని ఎంచుకోవటం ఒక గొప్ప అయితే.. అందులోనూ అది హైదరాబాద్ కు చెందిన ఆసుపత్రి కావటం తెలుగువారందరికి ఇది గర్వకారణంగా చెప్పక తప్పదు.