Begin typing your search above and press return to search.

భర్తపై కామెంట్స్‌ చేసిన ఆకతాయిలకు ఇలా బుద్ది చెప్పింది

By:  Tupaki Desk   |   4 Feb 2020 10:00 PM IST
భర్తపై కామెంట్స్‌ చేసిన ఆకతాయిలకు ఇలా బుద్ది చెప్పింది
X
ఐపీఎల్‌ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన స్టువర్ట్‌ బిన్నీ 2016 తర్వాత మళ్లీ వన్డేల్లో ఆడలేదు. ప్రస్తుతం వన్డేల్లో ఛాన్స్‌ కోసం బిన్నీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌ లో ఆడుతున్న స్టువర్ట్‌ బిన్నీ భార్య మయంతి గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ స్పోర్ట్‌ లో యాంకర్‌ గా.. మ్యాచ్‌ ఆరంభంకు ముందు చర్చ కార్యక్రమం.. మ్యాచ్‌ అనంతరం విశ్లేషణలను అందిస్తూ క్రీడాభిమానుల అభిమానం పొందుతుంది.

అందంతో పాటు ఆమె మాట్లాడే శైలి కూడా చాలా బాగుంటుంది. అందుకే ఆమె కోసం క్రికెట్‌ చూసే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఈమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. తన లైవ్‌ షో లు మరియు ఇతరత్ర విషయాలను ఆమె ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఫొటోను ట్వీట్‌ చేయగా ఇద్దరు ఆకతాయిలు కామెంట్స్‌ చేశారు. ఆమె భర్త బిన్నీ గురించి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె తీవ్రంగా స్పందించింది.

ఆ ఫొటోకు మొదట ఒక వ్యక్తి బిన్నీ ఎక్కడ అంటూ కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌ కు మరో నెటిజన్‌ స్పందిస్తూ ప్రస్తుతం అతడు మయంతి బ్యాగ్స్‌ ను మోయడంలో హెల్ప్‌ చేస్తున్నాడంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌ పై సీరియస్‌ అయిన మయంతి స్పందిస్తూ.. నా బ్యాగ్స్‌ ను నేను మోసుకోగలను థ్యాంక్యూ. ప్రస్తుతం బినీ క్రికెట్‌ ఆడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు. మీలా ఇతరులపై కామెంట్స్‌ చేస్తూ సమయంను వృదా చేయడం లేదంటూ కామెంట్స్‌ కు గట్టి సమాధానం ఇచ్చింది. మయంతి రిప్లైకు అంతా కూడా ఫిదా అయ్యారు.