Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు షాకివ్వనున్న మాయావతి..
By: Tupaki Desk | 20 Nov 2018 6:17 PM GMTమోదీ పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందన్న నేపథ్యంలో ఆ స్థానం కోసం ఇంటాబయటా పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటముల ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయి. అయితే.. ప్రధాని పదవిపై ఎంతో కాలంగా ఆశలు పెంచుకున్నా రోజురోజుకీ రాజకీయంగా బలహీనపడుతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రస్తుత సమయంలోనూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలోని నేతలను కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆమెకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు దిల్లీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్ బయట ఇతర రాష్ట్రాల్లో వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగే బలమైన అభ్యర్థులకు తమ గుర్తిచ్చే సంప్రదాయం పాటిస్తున్న బీఎస్పీ ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలకు నేరుగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
నిజానికి ఇప్పటికే బలమైన ప్రతిపక్షం వైసీపీని ఎలా ఎదుర్కోవాలా అని తలపట్టుకుంటున్న చంద్రబాబుకు తన మిత్రుడు పవన్ దూరం కావడం మరో శిరోభారంగా మారింది. పవన్ తమ ఓట్లు చీలుస్తారన్న భయం చంద్రబాబులో ఇప్పటికే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్పీ పోటీ చేస్తే తమకు రావాల్సిన దళిత ఓట్లలోనూ చీలిక తప్పదని చంద్రబాబు టెన్షన్ పడతున్నట్లు టాక్.
చంద్రబాబు రాజకీయ పర్యటనలపై మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తీవ్రంగా స్పందిస్తోంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఉత్తరాధిలో చంద్రబాబు ఎన్ని స్థానాలపై ప్రభావం చూపగలరు అని ప్రశ్నించారు. ఉత్తరాదిలో చంద్రబాబుకు ఉన్న శక్తి ఎంత అని బీఎస్పీ నాయకులు నిలదీయడం దీనికి ఉదాహరణగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 22న కూటమి పార్టీల సమావేశం ఏర్పాటు చేయగా… హాజరయ్యేందుకు బీఎస్పీ అంగీకరించలేదు. కూటమికి నాయకత్వం వహించేది ఎవరో చెప్పాల్సిందేనని పట్టుబడుతోంది. చంద్రబాబును ముందుకు తెస్తే తమకు ఇబ్బందిగా భావిస్తున్న ఆ పార్టీ ఏపీలో యాక్టివ్‌గా మారి చంద్రబాబును డిఫెన్సులోకి నెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.