Begin typing your search above and press return to search.

నిన్న‌టి మిత్ర‌ప‌క్షం.. నేడు బేకార్ కూట‌మైంది!

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:12 AM GMT
నిన్న‌టి మిత్ర‌ప‌క్షం.. నేడు బేకార్ కూట‌మైంది!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చాలా ఎక్కువ‌గా వినిపించిన మాట ఏమైనా ఉందంటే అది మ‌హా ఘ‌ట్ బంధ‌న్. యూపీలోని 80 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టానికి స‌మాజ్ వాదీ.. బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ కూట‌మి ఎఫెక్ట్ తో కేంద్రంలో ఏర్ప‌డే స‌ర్కారును ఈ కూట‌మి శాసిస్తుంద‌న్న అంచ‌నాలు జోరుగా సాగాయి.

అయితే.. మోడీ వేవ్ ముందు మ‌హాఘ‌ట్ బంధ‌న్ ఎత్తులు పార‌లేదు. తాజాగా ఈ కూట‌మి కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయిన ప‌రిస్థితి. కూట‌మికి రాంరాం చెబుతూ బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి నిర్ణ‌యం తీసుకున్నారు. అన్నింటికి మించి త‌న మిత్ర‌ప‌క్షమైన ఎస్పీని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో జ‌ర‌గ‌నున్న 11 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే మ‌హాఘ‌ట్ బంధ‌న్ వైఫ‌ల్యంపై మాయా గుస్సా అయ్యారు.ఇదో బేకార్ కూట‌మి.. మాకు యాద‌వ ఓట్లు ప‌డ‌లేదు. క‌నీసం అఖిలేశ్ కుటుంబానికి కూడా పూర్తిగా ప‌డ‌లేదు. క‌నోజ్ లో అఖిలేశ్ క‌నీసం త‌న భార్య డింపుల్ యాద‌వ్‌ను కూడా గెలిపించుకోలేక‌పోయారు. ఇంత‌కంటే పెద్ద ఓట‌మి ఏముంటుంది? అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

క‌నోజ్ లో మూడున్న‌ర ల‌క్ష‌ల యాద‌వ ఓట్లు ఉన్నాయ‌ని.. అవి గుండ‌గుత్తుగా డింపుల్ కు ప‌డాల‌ని.. కానీ ప‌డ‌లేద‌న్నారు. డింపుల్ కు ప‌డిన ఓట్లు అన్ని బీఎస్పీ ఓట్లేన‌ని ఆమె విశ్లేషించిన‌ట్లుగా తెలుస్తోంది.యాద‌వ ఓట్లు అన్ని బీజేపీకి ప‌డ్డాయ‌ని ఫ‌లితం చెబుతోంద‌న్న మాట వినిపిస్తోంది. ముస్లింలు ఎక్కువ ఉన్న చోట్లే ఎస్పీ గెలిచింద‌న్న వ్యాఖ్య మాయా నోటి వెంట వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

యూపీలో మ‌హా ఘ‌ట్ బంధ‌న్ పేరుతో జ‌త క‌ట్టిన కూట‌మిలోని బీఎస్పీ 38 స్థానాలు.. ఎస్పీ 37 స్థానాలు ఆర్ ఎల్డీ మూడు స్థానాల్లో పోటీ చేశాయి. కూట‌మిలో క‌ల‌వ‌కున్నా కాంగ్రెస్ కు రెండు సీట్ల (రాయ్ బ‌రేలీ.. అమేఠీ)ను విడిచిపెట్టారు. ఆ రెండింటిలోనూ ఒక దాన్లో (అమేఠీ) కాంగ్రెస్ ప‌రాజ‌యం పాల‌వ్వ‌టం తెలిసిందే. మోడీ గాలితో ఈ కూట‌మి చెల్లాచెదురు కావ‌టం ఒక ఎత్తు అయితే.. బీజేపీకి ఏకంగా 62 స్థానాల్ని సొంతం చేసుకుంది. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన అప్నాద‌ళ్ రెండు స్థానాల్ని కైవ‌శం చేసుకుంది. బీఎస్పీకి ప‌ది.. ఎస్పీకి ఐదు స్థానాల్లో విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాయావ‌తి కూట‌మిలోని మిత్ర‌ప‌క్ష‌మైన ఎస్పీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఓట‌మిని విశ్లేషించుకొని ఫ్యూచ‌ర్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాల్సిన స్థానే.. అఖిలేశ్ ను చిన్న‌బుచ్చేలా మాయా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎస్పీ ఆగ్ర‌హంగా ఉంది. ఇంత‌టి అవ‌మానాన్ని అఖిలేశ్ ఎప్పుడూ ఎదురుకాలేద‌న్న మాట వినిపిస్తోంది. వాస్త‌వానికి.. కూట‌మి కోసం అఖిలేశ్ బీఎస్పీ అధినేత్రికి అంతులేని గౌర‌వాన్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు అఖిలేశ్ ను హ‌ర్ట్ అయ్యేలా చేశాయ‌న్న మాట వినిపిస్తోంది.