Begin typing your search above and press return to search.

మాయవతి అల్టీమేటం.. కేసులు మాఫీ

By:  Tupaki Desk   |   2 Jan 2019 5:50 AM GMT
మాయవతి అల్టీమేటం.. కేసులు మాఫీ
X
సంకీర్ణ సర్కారులు ఎంత భయం భయంగా పాలిస్తాయో.. కూటమి పక్షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతలా దిగజారుతాయో తెలియజెప్పే సంఘటన చోటుచేసుకుంది. కేవలం ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలను పెట్టుకొని బీఎస్పీ అధినేత్రి మాయవతి మధ్యప్రదేశ్, రాజస్తాన్ సర్కారులను చెడుగుడు ఆడుకుంటున్న వైనం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ మెజార్టీకి రెండు సీట్లదూరంలో ఆగిపోగా.. మాయవతి ఆ రెండు సీట్ల మద్దతును ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు మాయవతి అల్టీమేటం జారీ చేస్తున్నారు. ఇటీవల భారత్ బంద్ లో దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా చెలరేగిన హింసలో నమోదైన కేసులన్నీ తక్షణం రద్దు చేయాలని లేకపోతే ప్రభుత్వం మనుగడ సాగించలేదని మాయా హెచ్చరించారు. తన మద్దతు కూడా ఉపసంహరించుకుంటానని ప్రకటించింది.

మాయవతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి. దీంతో సీఎం కమల్ నాథ్ వేగంగా స్పందించారు. భారత్ బంద్ హింసలో నమోదైన కేసులన్నింటిని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇలా కేవలం రెండు సీట్లతో మాయవతి పంతం నెగ్గించుకోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మాయావతి బ్లాక్ మెయిల్ కు కాంగ్రెస్ సర్కారు తలొగ్గడంతో ఈ సంకీర్ణ ప్రభుత్వాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బెదిరింపుల రాజకీయాలు నిలవవంటూ బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు..