Begin typing your search above and press return to search.

మోడీ ఓడిపోయిన‌ట్లే..బుర్హాన్ వ‌నీ అమ‌రుడు

By:  Tupaki Desk   |   4 Jan 2017 5:28 AM GMT
మోడీ ఓడిపోయిన‌ట్లే..బుర్హాన్ వ‌నీ అమ‌రుడు
X
ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై విప‌క్షాలు విరుచుకుపడుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ కులప్రాతిపదికపై ఓటు వేయరాదని యూపీ ప్రజలకు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై బీఎస్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ ఇలా ప్ర‌క‌టించ‌డం ద్వారా ప్రధాని మోడీ త‌మ ఓటమిని ఒప్పుకొన్నారని అన్నారు. సుప్రీంకోర్టు సూచన నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ త‌న ఓట‌మిని మాత్రం అంగీక‌రించార‌ని వ్యాఖ్యానించారు. కాగా తమది కులతత్వ పార్టీ అన్న ఆరోపణలను మాయావ‌తి తోసిపుచ్చారు.

విదేశాల నుంచి నల్లధనం తెస్తానని, ఇంకా ఏవేవో హామీలిచ్చిన ప్రధాని ఎన్నికల వాగ్దానాల్లో పావువంతు కూడా నెరవేర్చని కారణంగా ప్రజల దృష్టి మళ్లించేందుకే నోట్లరద్దును ముందుకు తెచ్చారని మాయావ‌తి అన్నారు. పైగా త‌న వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల మీదికి రుద్దుతూ అన‌వ‌స‌ర ఇబ్బందుల పాలు చేసేందుకు రోజుకో కొత్త నిబంధ‌న తెస్తూ స‌మ‌స్య‌ల పాలు చేస్తున్నార‌ని అన్నారు. ఇలా ప్ర‌జ‌ల్ని ఇక్క‌ట్ల పాలు చేసిన‌ బీజేపీ గెలిచే అవకాశాలు లేవని మాయావతి పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా... జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి జరిగిన అవమానాన్ని మరిచిపోకముందే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్సీ షౌకత్ హుస్సేన్ గనై మరో వివాదాన్ని సృష్టించారు. సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని ఆయన అమరుడిగా వర్ణించి వివాదానికి తెరతీశారు. చట్టసభలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పీడీపీ, బీజేపీ సభ్యులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. పీడీపీ సభ్యుడు ఫిర్దోస్ తక్ - బీజేపీ ఎమ్మెల్సీ సురీందర్ మాట్లాడుతూ ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్నారు. అనంతరం సభ బయట గనై మాట్లాడుతూ వని అమరుడే. 2015 వరకు అతనిపై ఎలాంటి కేసులు లేవు. అతనిపై ఉగ్రవాదిగా ఎలా ముద్ర వేశారో నాకు తెలియదు. కశ్మీర్ కోసం ప్రాణాలు త్యాగం చేశాడు అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/