Begin typing your search above and press return to search.
మాయావతికి సొంత విగ్రహాల తలనొప్పి!
By: Tupaki Desk | 3 April 2019 1:30 AM GMTఅధికారం చేతిలో ఉన్న సమయంలో చాలా మంది పాలకులకు తామేం చేస్తున్న విషయం అర్థం కాదు. అధికారంలో ఉన్నప్పుడు తోచింది చేస్తూ ఉంటారు. తమ వ్యక్తిగత ఇమేజ్ ను పెంచేసుకునేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వారు ప్రజల సొమ్మును - ట్యాక్స్ పేయర్ల డబ్బును అడ్డంగా వాడేయడానికి కూడా వెనుకాడరు. వందలు, వేల కోట్ల రూపాయలను ఇట్టే కరిగించేస్తూ ఉంటారు.
ఆ కోవలోకి చెందిన నేత మాయవతి కూడా. యూపీ మాజీ సీఎం అయిన బీఎస్పీ అధినేత్రి గతంలో తన హయాంలో చేసిన వ్యవహారం పై ఇప్పుడు కోర్టు లో వివరణ ఇచ్చుకున్నారు. తను యూపీ సీఎంగా ఉన్నప్పుడు మాయవతి చేసిన పనేంటి అంటే.. రాష్ట్రమంతా తన విగ్రహాలు పెట్టించుకోవడం. ప్రధాన కూడళ్లలో తన విగ్రహాలను - వాటితో పాటు తన పార్టీ సింబల్ అయిన ఏనుగు గుర్తును ఆమె పెట్టించుకున్నారు. ఆ తీరుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకా? అని అనేక మంది ప్రశ్నించారు. అయితే మాయవతి ఆ కామెంట్లను పెడ చెవిన పెట్టారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ములతో మాయవతి యూపీ అంతటా, తన విగ్రహాలను, తన పార్టీ సింబల్ అయిన ఏనుగు విగ్రహాలను పెట్టించుకున్నారు! మాయవతి తర్వాత యూపీలో అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ఆ విగ్రహాలను పట్టించుకోలేదు.
వాటిని చూసి అతడు భయపడనూ లేదు. మాయవతి విగ్రహాలను కూల్చేసే ఉద్ధేశం తమకు లేదని అఖిలేష్ అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే ఇలా ప్రజల సొమ్ముతో ఆమె సొంత విగ్రహాలు పెట్టించుకోవడంపై ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కారు. ఆమె ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని, ఆ రెండు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమె నుంచినే వసూలు చేయాలని ఆ పిటిషనర్ కోర్టుకు ఎక్కారు. దీనిపై వాదనలు సాగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మాయవతి కి నోటీసులు కూడా వెళ్లాయట. తాజాగా వాటికి ఆమె స్పందించారని సమాచారం. తన విగ్రహాలను తనే ఏర్పాటు చేయడం తప్పు కాదు అని - అందుకు ప్రజల సొమ్ములను వాడటం సబబే అని.. మాయవతి కోర్టుకు సమాధానం ఇచ్చారట!
తన విగ్రహాలను పెట్టడం అంటే అది దళిత మహిళకు దక్కిన గౌరవం అని ఆమె చెప్పుకొచ్చారట. ఇలా తన విగ్రహాలను తనే ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేయించుకుని - తన పార్టీ సింబల్ ను విగ్రహాలుగా పెట్టించడానికీ ప్రజల సొమ్మునే వాడిన మాయవతి ఈ వాదన వినిపించారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో!