Begin typing your search above and press return to search.
ఓటమి నిరాశఃసంచలన నిర్ణయం తీసుకున్న మాయావతి
By: Tupaki Desk | 13 March 2022 3:30 AM GMTదేశవ్యాప్తంగా ఆసక్తి, ఉత్కంఠను రేకెత్తించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ మరోసారి భారీ మెజార్టీ సాధించి రెండో సారి అధికారాన్ని చేపట్టబోతుండగా, ప్రధాన పార్టీల్లో ఒకటైన బీఎస్పీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఇంత దారుణ పరాభావం నేపథ్యంలో బీఎస్పీ రథసారథి మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారం కైవసం చేసుకునే జాబితాలో ఒకపార్టీ అనే దశ నుంచి కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయిన ఫలితాలతో బీఎస్పీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా మొత్తం కులపిచ్చితో ఉందని ఆమె ఆరోపించారు. యూపీలో తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది మీడియానే అని మండిపడ్డారు.
మీడియా సంస్థల యజమానులకు ఉన్న కుల వివక్ష, విద్వేషాలను ఎవరికీ తెలియకుండా దాయలేరని దుయ్యబట్టారు. అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్న బీఎస్పీని కుల పిచ్చితో ఉన్న మీడియా దెబ్బతీసిందని అన్నారు.
ఈ సందర్భంగా తాను తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మాయావతి వెల్లడించారు. బీజేపీకి బీఎస్పీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది మీడియానే అని… ఈ దుష్ప్రచారం వల్ల ముస్లింలు, బీజేపీ వ్యతిరేక ఓటర్లు బీఎస్పీకి దూరమయ్యారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి నుంచి టీవీ డిబేట్లను తమ పార్టీ బహిష్కరిస్తోందని సంచలన ప్రకటన చేశారు. కాగా, మాయావతి తీసుకున్న నిర్ణయం పట్ల ఆ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.