Begin typing your search above and press return to search.
బెహన్ జీ సంచలనం!..కాంగ్రెస్ కు గట్టి షాకే!
By: Tupaki Desk | 12 March 2019 5:08 PM GMTసార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన తరుణంలో కేంద్రంలో ఈ దఫా బీజేపీని ఎలాగైనా గద్దె దించాల్సిందేనన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహా కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఉత్తరాదిలో కీలక రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి - ఆ రాష్ట్ర మాజీ సీఎం మాయావతి... సంచలన నిర్ణయం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తో పాటు దేశంలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ తమ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదంటూ మాయావతి బాంబులాంటి వార్త పేల్చారు. మోదీని గద్దె దించాలంటే... తనతో కలిసి వస్తున్న పార్టీలతో పాటు బీఎస్పీ లాంటి కీలక పార్టీ అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందనే చెప్పాలి.
నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ప్రకటన వచ్చినా పెద్దగా పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్న బీఎస్పీ... తాజాగా మాయావతి చేసిన సంచలన ప్రకటన ద్వారా కాంగ్రెస్ చెప్పినట్టుగా తాను నడుచుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మాయావతి ప్రకటన నేపథ్యంలో ఒక్క బీఎస్పీనే కాకుండా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ)లు కూడా మహా కూటమికి దూరంగానే ఉండనున్నాయన్న వాదన వినిపిస్తోంది. గుజరాత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా మాయావతి ఈ ప్రకటన చేయడం విశేషం. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ - బీఎస్పీ పొత్తుతో వెళుతోందంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని మాయావతి అన్నారు. రెండు పార్టీలు నిజాయితీతో పనిచేస్తాయని చెప్పిన మాయావతి... ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీని మట్టి కరిపించేందుకు తమ కూటమి చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జనవరిలో బీఎస్పీ - ఎస్పీ పొత్తు ఖరారు అయ్యింది. కాంగ్రెస్‌ను ఈ రెండు పార్టీలు కలుపుకోలేదు.అయితే కాంగ్రెస్ పార్టీకి ఊరట ఏమిటంటే... ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ - ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీల నియోజకవర్గాలు రాయ్ బరేలీ - అమేథీలలో మాత్రం తమ అభ్యర్థులను నిలపకూడదని రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇక యూపీ బరి విషయానికి వస్తే... ఉత్తర్ ప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలుండగా ఎస్పీ 37 స్థానాలు - బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ ఎల్ డీ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేయనుంది.