Begin typing your search above and press return to search.
దావత్ ఇచ్చి దొరికిపోయిన హైదరాబాద్ మేయర్
By: Tupaki Desk | 27 March 2021 4:30 PM GMTవరుస వివాదాలతో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కుక్కకు భోజనం తినిపిస్తూ లీక్ అయిన ఆమె వీడియో వైరల్ కావడం అది రచ్చ రచ్చ అవ్వడం చూశాం. మరికొన్ని నిర్ణయాలతోనూ విజయలక్ష్మీ వివాదాస్పదమయ్యారు. తాజాగా జహంగీర్ పీర్ దర్గా వద్ద తన అనుచరులకు ధావత్ ఇచ్చారు మేయర్.
తెలంగాణలో ఓ వైపు కరోనా కేసులు మళ్లీ ఎక్కువగా నమోదవుతున్న వేళ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మేయర్ ఈ విధంగా ధావత్ వేడుకలు నిర్వహించి మరో వివాదానికి దారితీశారు.బంజారాహిల్స్ కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయితే తన అనుచరులకు ధావత్ ఇస్తానని తొలుత హామీ ఇచ్చారట విజయలక్ష్మీ. అన్నట్టుగానే కాలం కలిసివచ్చి.. కేసీఆర్ కరుణించి మేయర్ అయ్యారు.
దీంతో ఇప్పుడు తన కోసం కష్టపడి పనిచేసిన అనుచరులకు జహంగీర్ పీర్ దర్గా వద్ద పెద్దఎత్తున మేయర్ దావత్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుక్కయ్యారు. కరోనా నిబంధనలు సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తాయా? నాయకులకు వర్తించవా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.