Begin typing your search above and press return to search.
నిజామాబాద్ మేయర్ పీఠం పై వీడిన ఉత్కంఠ ...పీఠం ఎవరిదంటే ?
By: Tupaki Desk | 27 Jan 2020 7:26 AM GMTనిజామాబాద్ మేయర్ పదవి ఎవరిదో ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు విడుదల అయిన తరువాత మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం పై ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. దానికి కారణం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడడం. అత్యధికంగా బీజేపీ 28 డివిజన్లు గెల్చుకోగా, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 1 గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ చాణిక్యత చూపించిన టిఆర్ ఎస్ నిజామాబాద్ కోట పై కూడా గులాబీ జెండాని ఎగురవేయబోతుంది.
మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వనుంది. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ కూడా గులాబీ గూటికి చేరాడు. దీని తో పాటుగా టి ఆర్ ఎస్ కి ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతు కూడా ఉంది. దీనితో నిజామాబాద్ టీఆర్ ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. కానీ , ప్రస్తుతం టి ఆర్ ఎస్ కి మద్దతుగా 37 మంది సభ్యులు ఉన్నారు. దీనితో అక్కడ సస్పెన్స్ పై ఉత్కంఠత విడిపోయింది. ఈ నేపథ్యం లోనే మేయర్ పదవి టీఆర్ ఎస్ కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎం కు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.
ఇకపోతే , 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ , రావాల్సిన మెజారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో.. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని.. టీఆర్ ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్‌అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్ ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే.