Begin typing your search above and press return to search.
మెక్ డొనాల్డ్స్ ను అమ్మేస్తున్నారు
By: Tupaki Desk | 9 Jan 2017 4:07 PM GMTఅమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ ను అమ్మేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్థ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అని ఆలోచించకండి. ఇది కేవలం చైనా దేశానికి మాత్రమే పరిమితం. చైనాలోని తన వ్యాపార సామ్రాజ్యాన్ని కార్లిల్ - సిటిక్ గ్రూప్ కు విక్రయించేందుకు మెక్ డొనాల్డ్స్ డీల్ కుదుర్చుకుంది. 2.08 బిలియన్ డాలర్ల(రూ.14.195 వేల కోట్లు)కు చైనా - హాంకాంగ్ లోని తమ వ్యాపారాన్ని కార్లిల్ గ్రూప్ కు విక్రయించినట్టు మెక్ డొనాల్డ్స్ అధికారికంగా వెల్లడించారు. వ్యాపార వృద్ధి మందగించడంతో మెక్ డొనాల్డ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అమ్మకపు డీల్ అనంతరం సిటిక్ లిమిటెడ్ - సిటిక్ కేపిటల్ హోల్డింగ్స్ - కార్లిల్ గ్రూప్ - మెక్ డొనాల్డ్స్ కలిసి ఓ కంపెనీగా ఏర్పడనున్నాయి. కాగా తాజా డీల్ ప్రకారం చైనా వ్యాపారంలో సిటిక్ - సిటిక్ కేపిటల్ లు 52 శాతం వాటాను దక్కించుకోనుండగా కార్లిల్ 28 శాతం షేర్లు దక్కనున్నాయి. మెక్ డొనాల్డ్స్ వాటా 20 శాతానికి పరిమితం కానుంది. ఇటీవల పలు కంపెనీల నుంచి ఎదురైన పోటీ మెక్ డొనాల్డ్స్ తనలాభాలను పూర్వపు స్థాయిలో మెరుగు పరుచుకోలేకపోయింది. ఈ క్రమంలో గ్రూప్ వ్యాపారాన్ని అమ్మివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/