Begin typing your search above and press return to search.
రాజధానిలో మెక్ డొనాల్డ్స్‌ను మూసేశారు
By: Tupaki Desk | 29 Jun 2017 1:26 PM GMTఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లు దేశ రాజధాని ఢిల్లీలో మూతపడ్డాయి. మొత్తం 55 రెస్టారెంట్లలో 43 ఇవాళ్టి నుంచి మూతపడ్డాయి. వీటి లైసెన్సు కాలం నేటితో పూర్తయింది. ఈ ఔట్ లెట్స్ ఈటింగ్ హౌజ్ లైసెన్స్‌లను కోల్పోయాయి. ఆహారం నాణ్యత లోపించడం వల్ల లైసెన్స్ పునరుద్ధరించలేదు. అటు ఆదాయం పడిపోవడం, పెట్టుబడులు లేకపోవడం, యాజమాన్యం విషయంలో న్యాయ పోరాటం వల్ల ఈ ఔట్‌లెట్స్ మూతపడ్డాయి. ఈ ఔట్ లెట్స్ మూతపడటం వల్ల 1700 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు.
నార్త్ ఇండియాలో ఫాస్ట్ ఫుడ్ చెయిన్ రెస్టారెంట్లు నడిపే కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ తో మెక్ డొనాల్డ్స్‌కు యాజమాన్యం విషయంలో వివాదం కొనసాగుతోంది. స్కైప్ ద్వారా నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ ఔట్ లెట్స్ ను మూసేయాలని నిర్ణయించిట్లు ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్‌లో దాని ఫౌండర్ విక్రమ్ భక్షికి - మెక్ డొనాల్డ్స్‌కి చెరో 50 శాతం వాటా ఉంది. అయితే 2013లో మెక్ డొనాల్డ్స్ డైరెక్టర్ పదవి నుంచి భక్షిని తొలగించడంతో వివాదం మొదలైంది. దీనిని భక్షి కంపెనీ లా బోర్డులో సవాలు చేశారు. అప్పటి నుంచి న్యాయ పోరాటం మొదలైంది. దీంతో ఈ ఔట్ లెట్స్‌లో కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ గొడవల కారణంగా 2013లోనే ఇండియాలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్ బిజినెస్ లో మెక్ డొనాల్డ్స్‌ను వెనక్కి నెట్టి డొమినోస్ ముందుకెళ్లింది.