Begin typing your search above and press return to search.
రామాలయం కోసం 27 ఏళ్లు గా భోజనానికి బంద్ చెప్పిన ఊర్మిళ
By: Tupaki Desk | 12 Nov 2019 4:26 AM GMTరామాయణం లో ఊర్మిళ పాత్ర ప్రత్యేకత తెలుసుగా? లక్ష్మణుడి భార్యగానే కాదు.. అన్న శ్రీరాముడి తో పాటు వన వాసానికి వెళ్లిన లక్ష్మణుడు కంటి మీద కనుకు తీయకుండా ఉంటే.. భర్త తిరిగి వచ్చే వరకూ ఊర్మిళ 14 ఏళ్ల పాటు నిద్రలోనే గడిపిన వైనాన్ని రామాయణం చెబుతుంది. అది అప్పటి ఊర్మిళ కథ.
నయా భారతం లో ఇప్పుడో మరో ఊర్మిళ రామాలయం కోసం పడిన పాట్లు అన్ని అన్ని కావు. అయోధ్యలో బాబ్రీ మసీదు ను కూల్చివేత రోజున భోజనానికి బంద్ చేసిన ఊర్మిళ.. తాజా గా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్లీ భోజనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. రామాలయం కోసం భారీ దీక్ష కే దిగారు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన ఊర్మిళ.
రామమందిరం కల సాకారం కావాలని రెండు పూటల తీసుకునే భోజనాన్ని వది లేసి.. కేవలం పండ్లు.. పాలతో దీక్ష చేస్తున్నారు సంస్కృత ఉపాధ్యాయురాలి గా పని చేస్తున్న 81 ఏళ్ల ఊర్మిళా చతుర్వేది. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవటం మానేశారు. పండ్లు.. పాలనే తీసుకుంటూ 27 ఏళ్లుగా ఉన్నారు. అయోధ్య లో వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వటంతో తిరిగి ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధమయ్యారు.