Begin typing your search above and press return to search.
జంపింగ్ ల కలవరం..ఎమ్మెల్యేతో బాబు స్పెషల్ మీటింగ్
By: Tupaki Desk | 23 Dec 2018 4:21 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో పరిణామాలపై అలర్ట్ అయ్యారు. టీడీపీ తరఫున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే టీఆర్ ఎస్ లో చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారనే వార్తలు వచ్చి సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య - అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. సండ్ర తన అనుచరులు - నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సత్తుపల్లిలో శుక్రవారం సమావేశంలో ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు కూడా చేసినట్లుగా రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు - సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఖమ్మంలో రహస్యంగా కలుసుకుని చర్చించినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ ఎపిసోడ్ పై చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావును తన వద్దకు పిలిపించుకున్నారు. టీడీపీని వీడి టీఆర్ ఎస్ పార్టీలో చేరతారంటూ రెండు రోజుల నుంచి ప్రచారం జోరందుకున్న నేపథ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఆయన వివరణ కోరారు. దీంతో టీడీపీని వీడి వెళ్లడం లేదని చంద్రబాబుకు వివరించారు. అనంతరం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అశ్వారావుపేట టికెట్ ఇచ్చి అవకాశం కల్పించారని ఆయన అన్నారు. 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కోనసాగుతున్నానని.. బతితికి ఉన్నంతవరకూ ఈ పార్టీలోనే కోనసాగుతానని చెప్పారు.