Begin typing your search above and press return to search.

తుమ్మల గురువు.. టీడీపీ వీడడం లేదు..

By:  Tupaki Desk   |   11 Jan 2019 7:28 AM
తుమ్మల గురువు.. టీడీపీ వీడడం లేదు..
X
తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేయాలన్న కేసీఆర్ పట్టుదలను భుజాన వేసుకున్న తుమ్మల సక్సెస్ అయినట్టే కనిపించి విఫలమయ్యాడు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 13 సీట్లలో పోటీ చేసిన టీడీపీ రెండే సీట్లలో గెలిచింది. సత్తుపల్లి నుంచి సండ్ర.. అశ్వారావుపేట నుంచి నాగేశ్వరరావు గెలిచారు. వీరిద్దరికి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన టీఆర్ ఎస్ చేర్చుకునే దిశగా వేస్తున్న ప్లాన్లు వర్కవుట్ కావడం లేదు. సండ్ర మొదట ఓకే అన్నా నాగేశ్వరరావు మాత్రం కరగడం లేదు.

తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చక్రం తిప్పారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ఇంటికి పిలిచి నచ్చ చెప్పారు. టీఆర్ ఎస్ లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరినీ టీఆర్ ఎస్ చేర్పిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని తుమ్మల భావించారు.

కానీ తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగాశ్వరరావు తుమ్మలతో భేటిపై క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలు అని స్పష్టం చేశారు. తాను టీడీపీని వీడనని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి తుమ్మల తనకు రాజకీయ గురువు అని.. ఆయన శిష్యుడిగా మర్యాద పూర్వకంగానే కలిసినట్టు వివవరించారు. తమ కలయికలో రాజకీయ కారణాలు లేవన్నారు. 34 ఏళ్లుగా టీడీపీ అధినేత బాబు తనకు ఎంతో గుర్తింపు ఇచ్చారని తెలిపారు.

దీంతో ఇటు తుమ్మల ఆశలు, అటు టీఆర్ ఎస్ ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయి. అసెంబ్లీ లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలోపు టీడీపీ ఎమ్మెల్యేలను కారెక్కించాలన్న గులాబీ బాస్ కల నెరవేరేలా కనిపించడం లేదు.