Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో రూ.1.20కోట్లు డ్రా చేసిన ‘విజయ’

By:  Tupaki Desk   |   19 Nov 2016 6:21 AM GMT
ఒక్కరోజులో రూ.1.20కోట్లు డ్రా చేసిన ‘విజయ’
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం పలు విధివిధానాలు.. ఆంక్షల్ని పెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతాల నుంచి అయితే రూ.24వేలు.. కరెంటు ఖాతాల నుంచి అయితే రూ.50వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలున్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా ఎంత మొత్తాన్ని అయినా బదిలీ చేసే అవకాశం ఉన్నా.. నగదు డ్రా విషయంలో మాత్రం కఠినమైన నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక సంచలన విషయం బయటకు వచ్చింది.

మెదక్ పట్టణానికి చెందిన చెందిన ఎస్ బీహెచ్ బ్యాంకు అధికారులు ఈ నిబంధనల్ని అస్సలు పట్టించుకోలేదు. బ్యాంకు బయట డబ్బుల కోసం జనం బారులు తీరి ఉన్నా.. వాటిని వదిలేసి.. విజయ డెయిరీ ఖాతాకు సంబంధించి రూ.1.20కోట్ల మొత్తాన్ని డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది.

రూల్స్ కు విరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో విజయడెయిరీ సుపరిచితమే. పాడి రైతుల నుంచి సేకరించిన పాలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దన్న ఆంక్షలు విధించారు. కానీ.. అందుకు భిన్నంగా మెదక్ ఎస్ బీహెచ్ బ్యాంక్ అధికారులు ఈ నెల 11న విజయ డెయిరీకి చెందిన ఖాతా నుంచి ఒకే రోజులో రూ.1.20కోట్లను డ్రా చేసుకునేందుకు అనుమతించారు.

సుమారు 13 సొసైటీ చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని డ్రా చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపైభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బ్లాక్ మనీని వైట్ చేసేపనిలో భాగంగా బ్యాంకు అధికారులు..విజయ అధికారులు కుమ్మక్కై ఇంత పెద్దమొత్తాన్ని బయటకు తీసి ఉంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే విజయ డెయిరీ మేనేజర్ వాదన మరోలా ఉంది. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించేక్రమంలో ఈ మొత్తాన్ని డ్రా చేసినట్లుగా చెబుతున్నారు. మామూలు రోజుల్లో అయితే.. ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ.. ప్రభుత్వం స్పష్టంగా బ్యాంకు నుంచి డ్రా చేసే నిధుల మీద స్పష్టమైన పరిమితుల్ని విధించిన సందర్భంలోనూ ఇంత మొత్తం నిబంధనలకు విరుద్ధంగా డ్రా కావటం పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/