Begin typing your search above and press return to search.
ఎక్కువ సంతానం ఉంటే ఒలింపిక్ పతకం
By: Tupaki Desk | 16 Aug 2016 3:27 AM GMTఒలింపిక్స్ లో పిల్లల్ని కనే పోటీలు కూడా ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా! అలాంటి పోటీలు లేవు కానీ, ఫ్రాన్స్ లో సేమ్ టు సేమ్ అదే తరహా పోటీలు - సేమ్ టు సేమ్ పథకాలు అందజేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా నిజంగా బంగారు - వెండి - కాంస్యం పతకాలు అందజేస్తున్నారు.
ఫ్రాన్స్ లో 'మెడల్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్యామిలీ' పేరుతో 1920 నుంచి ఒక చట్టం అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం ఒలింపిక్స్ లో పతకాల తరహాలో కుటుంబం సైజ్ ను బట్టి ప్రభుత్వం పతకం ప్రదానం చేస్తుంది. కుటుంబంలో దంపతులు ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లల్ని కంటే వారికి స్వర్ణ పతకం ప్రదానం చేస్తుంది. అలాగే ఆరు నుంచి ఏడుగురు పిల్లల్ని కంటే వారికి రజత పతకం అందజేస్తుంది. నాలుగు నుంచి ఐదుగురు పిల్లల్ని కంటే కాంస్య పతకం ఇస్తుంది. అంతకంటే తక్కువ మందితో సరిపెట్టుకుంటే ఆ కుటుంబాన్ని సాధారణ కుటుంబంగా పరిగణించి వారికి ఎలాం టి పతకమూ ప్రదానం చేయదు. ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేసే ఈ పతకాలపై పిల్లల రూపాలు ఉంటాయి. ఈ పతకం పొందడానికి అభ్యర్థులు దరఖాస్తును స్థానిక కార్యాలయంలో అందజేయాలి. ఈ దరఖాస్తు పరిశీలించిన అధికారులు వారి కుటుంబంపై పూర్తిగా దర్యాప్తు చేస్తారు. పిల్లలంతా సక్రమ సంతానమే అని తేలిన తరువాతే పతకానికి ఎంపిక చేస్తారు. ఈ చట్టానికి సవరణలు చేసి పతకం పేరును 'మెడల్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్యామిలీ'గా మార్చారు. అంతే కాదు, ఆనాథ పిల్లల్ని చేరదీసి పెంచుతున్న వారు కూడా ఈ పతకానికి అర్హులు అని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడం విశేషం.