Begin typing your search above and press return to search.
తాలిబన్ల చేతిలో మీడియాపై విలవిల
By: Tupaki Desk | 27 Sep 2021 6:35 AM GMTఅందరు అనుకున్నట్లుగానే ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్లు మీడియా స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. దేశంలోని జనాలు పడుతున్న అవస్తలను ప్రపంచం దృష్టికి తీసుకెళుతున్న మీడియా వల్ల తమ పరువుపోతోందని తాలిబన్ల+హక్కానీ నెట్ వర్క్ ప్రభుత్వం బాగా కోపంగా ఉంది. దీంతో ముందు మీడియాను నియంత్రణలోకి తెచ్చుకోకపోతే పరువు పోతుందని గ్రహించారు. అందుకనే మీడియాను నియంత్రణలోకి తెచ్చుకోవటంలో భాగంగా ముందు రిపోర్టర్ల మీద పడ్డారు.
యావత్ మీడియా సంస్ధలను భయపెట్టడం కోసం ఇద్దరు జర్నలిస్టులను చంపేశారు. మహిళా జర్నలిస్టులను, న్యూస్ యాంకర్లను ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ) సంస్ధల్లో ఎక్కడా కనబడకూడదని నిషేధం విదించారు. రిపోర్టర్లు వినకపోవటంతో కొందరిని పట్టుకుని చచ్చేట్టు కొట్టి వదిలిపెట్టారు. దీనివల్ల కూడా లాభంలేదని అనుకున్నట్లున్నారు. ఏకంగా 150 మీడియా సంస్ధలపై బ్యాన్ విధించారు. ఇదికూడా సరిపోదన్నట్లుగా పనిచేస్తున్న మీడియా సంస్ధలు ప్రసారం చేస్తున్న వార్తలు, ప్రచురణపై సెన్సార్ షిప్ విధించారు. దేశంలో మీడియా పడుతున్న అవస్తలపై న్యూయార్క్ టైమ్స్ పెద్ద కథనాన్నే ప్రచురించింది.
మీడియా సంస్ధల నుండి ప్రసారమయ్యే వార్తలు, ప్రచురిస్తున్న వార్తలను ముందుగా తమకు చూపించాలని, అనుమతి తీసుకన్న తర్వాతే ముందుకు అడుగులు వేయాలని తాలిబన్లు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి అనేక నిషేధాలతో, ఆదేశాలతో మీడియా యాజమాన్యాలు తాలిబన్ల దెబ్బకు వణికిపోతున్నాయి. ఆగష్టు 15వ తేదీన తాలిబన్లు దేశాధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్న దగ్గర నుండి జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను ప్రపంచం కళ్ళకుకట్టినట్లు మీడియా చూపిస్తోంది.
దేశంలో జరుగుతున్న అనేక ఘటనలు, తాలిబన్ల అకృత్యాలు, ప్రజల దీనావస్తలు ప్రపంచం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఈ కారణంగానే మిగిలిన దేశాలు ఆప్ఘన్ పై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. దేశంలోని జనాలు తిండి, మందుల్లాంటి కనీస అవసరాలు లేక అల్లాడిపోతున్నా తాలిబన్ల కారణంగానే మిగిలిన ప్రపంచం ఏమీ చేయలేకపోతోంది. తాజాగా మీడియా సంస్ధల మీద ఉక్కుపాదం మోపటంతో దేశంలో జరిగే వ్యవహారాలు ఉన్నది ఉన్నట్లుగా ప్రపంచం చూసే అవకాశాలు తగ్గిపోతాయనటంలో సందేహంలేదు. మరి మీడియాపై ఈ నిషేధం ఎంతకాలం కంటిన్యు అవుతుందో చూడాలి.