Begin typing your search above and press return to search.
బాలకోట్ పై మాటమార్చిన పాకిస్తాన్
By: Tupaki Desk | 9 March 2019 10:08 AM GMTబాలకోట్ పై పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. ఇటీవల ఇండియా మిరాజ్ యుద్ధవిమానాలతో బాలకోట్ లోని జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలపై మెరుపు దాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో నేలమట్టమైన ఉగ్ర స్థావరాలను సందర్శించేందుకు తాజాగా ప్రఖ్యాత ఇంగ్లీష్ మీడియా రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టులు యత్నించారు. అయితే వారు ఆ ప్రాంతానికి వెళ్లకుండా పాక్ సైన్యం అడ్డుకుంది.
బాలకోట్ లో భారత వైమానిక దళం దాడి చేసిన ప్రాంతాన్ని చూపిస్తామని రాయిటర్స్ జర్నలిస్టులకు పాక్ ప్రభుత్వం అనుమతించింది. తీరా అక్కడి వెళ్లేందుకు యత్నించగా భద్రతా కారణాల వల్ల ఎవరినీ అనుమతించడం లేదని రాయిటర్స్ జర్నలిస్టులను అడ్డుకుంది. ఇలా రాయిటర్స్ ప్రతినిధులను అడ్డుకోవడం గత తొమ్మిది రోజుల్లో ఇది మూడోసారి.
వాతావరణం అనుకూలంగా లేదని కుంటిసాకులు చెబుతూ ప్రతిసారీ మీడియా ప్రతినిధులను వెనక్కి పంపిస్తుంది పాక్ సైన్యం. దీంతో చేసిదేమీ లేక తిరుగుపయనం అవుతున్నారు. కొన్ని రోజుల వరకు ఆ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యపడకపోవచ్చని పాక్ అధికారులు చెబుతున్నారు.. ఇంతమాత్రానికి మీడియా ప్రతినిధులకు ఎందుకు అనుమతిస్తున్నారు.. తీరా అక్కడికి చేరుకున్నాక ఎందుకు అడ్డుపడుతున్నారని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇప్పటికీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.