Begin typing your search above and press return to search.
మీడియా కంటికి చిక్కిన షా టాప్ సీక్రెట్ ఫైల్!
By: Tupaki Desk | 6 Aug 2019 9:11 AM GMTటాప్ సీక్రెట్ ఫైల్ అన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అందునా.. అది దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేది.. కీలక నిర్ణయానికి సంబంధించిందన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా టాప్ సీక్రెట్ ఫైల్ ను చేతుల్లో పట్టుకొని పార్లమెంటుకు వస్తూ.. కెమేరా కంటికి దొరికిపోయారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
జమ్ముకశ్మీర్ అంశంపై చేయాల్సిన ఆపరేషన్.. ఆర్టికల్ 370 స్వరూపంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులకు సంబంధించి ఏ రోజున ఏం చేయాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ కు సంబంధించిన ఫైల్ ఒకటి అమిత్ షా చేతిలో ఉంది. పార్లమెంటు లోపలకు వెళ్లే టైంలో ఆయన చేతిలో పత్రాలు ఉన్నాయి. రోటీన్ లో భాగంగా.. అక్కడున్న ఒక ఫోటోగ్రాఫర్ ఒకరు ఫోటో తీశారు. అమిత్ షా చేతిలో ఉన్న ఫైల్ ఏమిటన్న వివరాలు చూసిన సదరు ఫోటో గ్రాఫర్ అవాక్కు అయ్యే పరిస్థితి.
ఎందుకంటే జమ్ముకశ్మీర్ ఇష్యూకు సంబంధించి ఎప్పుడేం చేయాలన్న అంశంపై అందులో షెడ్యూల్ క్లియర్ గా ఉంది. భద్రతా దళాల్ని తరలింపు దగ్గర నుంచి.. రాజ్యాంగపరమైన.. రాజకీయ.. శాంతిభద్రతలకు సంబంధించి ఎప్పుడేం చర్యలు తీసుకోవాలన్న వివరాలన్ని అందులో స్పష్టంగా ఉన్నాయి.
ఈ పేపర్ల కుడి వైపున టాప్ సీక్రెట్ అన్న అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే.. కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు ఎప్పుడేం చేయాలన్న దానిపై భారీ ఎత్తున కసరత్తు జరిపి.. వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నట్లుగా అర్థం కాక మానదు. కెమేరా కంటికి చిక్కిన పత్రాల ప్రకారం ఏయే తేదీల్లో ఏమేం చేయాలో అందులో స్పష్టంగా ఉంది. రాజ్యాంగ పరమైన చర్యల్లో భాగంగా రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతికి ఈ అంశం గురించి చెప్పినట్లుగా ఉంది. అంతేకాదు.. కేబినెట్ భేటీ నిర్వహణ.. రాష్ట్రపతి నోటిఫికేషన్.. పార్లమెంటులో బిల్లు ఆమోదం ఐదో తేదీన జరగాలని కూడా ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారమే నిన్న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగి.. ఓటింగ్ జరిగి బిల్లుకు ఆమోదముద్ర పడటం తెలిసిందే.
అంతేకాదు.. రాజకీయపరమైన చర్యల్లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటం.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించాల్సిన సమయం ఆగస్టు 7గా అందులో ఉంది. అంతేకాదు.. తాము తీసుకునే నిర్ణయంతో భద్రతా దళాల్లో సైతం హింసాత్మక చర్యలు చోటు చేసుకునే ప్రమాదాన్ని ఊహించి.. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందిచన వైనం కూడా కెమేరా కంటికి చిక్కిన ఫైల్ లో ఉంది. ఇదంతా చూస్తే.. ఇంతటి టాప్ సీక్రెట్ ఫైల్ ను అమిత్ షా అందరికి కనిపించేలా చేశారన్నది ప్రశ్న. బీజేపీ వర్గాలవాదన ప్రకారం తన ప్రయాణంలో భాగంగా అమిత్ షా ఈ పత్రాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండి ఉంటారని.. కారులో ఆ పత్రాల్ని చదివటం.. పార్లమెంటు రావటంతో హడావుడిగా లోపలకు వెళ్లే క్రమంలో కెమేరా కంటికి చిక్కటంతో బయటకు వచ్చాయి కానీ.. మామూలుగా అయితే.. ఈ వివరాలు బయటకు పొక్కే అవకాశం లేదంటున్నారు. టాప్ సీక్రెట్ ఫైల్స్ విషయంలో అమిత్ షాది నిర్లక్ష్యంగా భావించలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.