Begin typing your search above and press return to search.

అసలీ ‘ఈనాడు.. సాక్షి.. జ్యోతిలకు ఏమైంది?

By:  Tupaki Desk   |   9 Jun 2016 4:22 PM GMT
అసలీ ‘ఈనాడు.. సాక్షి.. జ్యోతిలకు ఏమైంది?
X
తప్పుల మీద తప్పులు చేస్తున్నాయి పెద్ద పెద్ద మీడియా సంస్థలు. ఈ రోజు రాత్రి ఉన్నట్లుండి ప్రధాన మీడియా సంస్థలకు చెందిన టీవీ ఛానల్స్ లో ఒకరేమో తాజా కబురని.. మరొకరు బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావుడి.. హడావుడిగా.. ఏపీ సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా ఏపీ సర్కారు గురువారం సాయత్రం తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మకు లేఖ రాశారని.. ఈ నెల 27 తర్వాత సచివాలయాన్ని అప్పగిస్తున్నట్లుగా వార్త వేశారు. అక్కడితో ఆగకుండా నార్త్ హెచ్.. సౌత్ హెచ్.. కే.. జే బ్లాకులను అప్పగిస్తున్నట్లుగా వార్త ఇచ్చేశారు.

కాసేపటికే ప్రధాన ఛానళ్లకు చెందిన మిగిలిన విభాలతో పాటు.. ఈనాడు.. సాక్షి.. ఆంధ్రజ్యోతితో సహా అన్ని మీడియా సంస్థలు ఇదే వార్తను అచ్చేశాయి. వాటి వెబ్ ఎడిషన్లలో ఈ వార్తను వేయటంతో ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. ఎందుకంటే.. ఏపీ సచివాలయాన్ని దశల వారీగా తరలిస్తామని ఈ మధ్యనే ఏపీ సర్కారు చెప్పిన విషయం తెలిసిందే. ఓపక్క ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు తేలకపోవటం.. మరోవైపు.. సచివాలయ నిర్మాణం పూర్తి కాని నేపథ్యంలో.. కనీసం మరో నెల రోజులైనా నిర్మాణం పూర్తి కావటానికి టైం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.

మౌలిక వసతులకు ఇంకో నెల.. నెలన్నర వరకూ సమయం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా వార్త వేయటం విచిత్రం. కాసేపటికే తప్పు తెలుసుకున్న ఛానళ్లు ఆ విషయం మీద సౌండ్ చేయకుండా కామ్ గా ఉండిపోతే.. ఈ ప్రధాన మీడియా సంస్థలకు చెందిన వెబ్ సైట్లు మాత్రం తమ వార్తల్ని మార్చేశాయి. కాకుంటే.. మొబైల్ యాప్ లలో ఇచ్చిన మెసేజ్ లను మాత్రం తిరిగి తీసుకోరు కాబట్టి.. వారు చేసిన తప్పులకు సాక్ష్యంగా నిలిచిన పరిస్థితి. ఏదో పిల్ల పిల్ల మీడియా సంస్థలు తప్పు చేస్తే.. నెట్ వర్క్ లోపం అని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రముఖ మీడియా సంస్థలు ఇలాంటి తప్పుల్ని ఎందుకు చేస్తాయి చెప్మా..?