Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ పై కేసులు పెట్టే దిశ‌గా మీడియా సంస్థ‌లు!

By:  Tupaki Desk   |   22 April 2018 8:28 AM GMT
ప‌వ‌న్‌ పై కేసులు పెట్టే దిశ‌గా మీడియా సంస్థ‌లు!
X
ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని ఒక అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోవ‌ట‌మే కాదు.. అంత‌కంత‌కూ ఈ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరిపోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అధికార‌ప‌క్షంలో ఉన్న వారు కొన్ని మీడియా సంస్థ‌ల‌పై క‌త్తి క‌ట్ట‌టం తెలిసిందే. ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు క‌త్తి కట్టిన ప్ర‌భుత్వాధినేత ఆగ్ర‌హానికి విల‌విల‌లాడిన కొన్ని మీడియా సంస్థ‌ల‌పైన ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌త్తి క‌ట్ట‌టం.. వారిని ఢీ కొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడ‌క‌పోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు మీడియాను టార్గెట్ చేయ‌టం పాత విధానం. కానీ.. ప‌వ‌ర్ ను త‌న పేరు ముందు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ సాహ‌సానికి తెర తీస్తున్నట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు మూడు రోజులుగా టీవీ9.. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిల‌పై ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ రోజు కూడా ప‌లు ట్వీట్లు చేశారు. ఇక‌.. ఈ ఛాన‌ళ్లు త‌న త‌ల్లిని ధూషిస్తూ శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ను ప్ర‌సారం చేసిన వైనాన్నిప‌వ‌న్ త‌ప్పుప‌డుతున్నారు.

దీనికి సంబంధించిన ఒక వీడియోక్లిప్ ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రెండుసార్లు పోస్ట్ చేశారు. త‌న త‌ల్లిని ఉద్దేశించి శ్రీ‌రెడ్డి చేసిన అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ప‌లు మీడియా సంస్థ‌లు త‌ప్ప ప‌డుతున్నాయి. అది ఒరిజిన‌ల్ కాద‌ని.. మార్ఫింగ్ చేశార‌ని.. ఫేక్ వీడియో అంటూ ప‌వ‌న్ వ‌ర్గంపై మండిప‌డుతున్నారు.

శ్రీ‌రెడ్డి అస‌భ్య‌ప‌ద‌జాలంతో కూడిన వీడియో క్లిప్ ను తాము బీప్ చేసి టెలికాస్ట్ చేశామ‌ని.. ప‌వ‌న్ మాత్రం అందుకు భిన్నంగా బీప్ తీసేసిన వీడియోను పోస్ట్ చేసి ఛాన‌ల్ ఇమేజ్ ను చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. తాము బీప్ సౌండ్ తో ప్ర‌సారం చేసిన వీడియోను.. బీప్ లేకుండా పోస్ట్ చేయ‌టంపై టీవీ9.. ఎబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛాన‌ళ్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ప‌వ‌న్ పై ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

మీడియా వ‌ర్గాల వాద‌న ప్ర‌కారం..శ్రీ‌రెడ్డి అస‌భ్య ప‌ద‌జాలంతో కూడిన వీడియోను బీప్ పెట్టి టెలికాస్ట్ చేసిన‌ట్లుగా చెబుతుంటే.. అందుకు భిన్నమైన వాద‌న‌ను ప‌వ‌న్ వ‌ర్గం వినిపిస్తోంది. బీప్ లేకుండా టీవీ9.. ఎబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛాన‌ళ్లు టెలికాస్ట్ చేశాయ‌ని.. అందుకు త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్న‌ట్లుగా వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఇద్ద‌రితో సంబంధం లేని మీడియాలోని మ‌రో వ‌ర్గం ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. శ్రీ‌రెడ్డి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌తో కూడిన వీడియో క్లిప్ కు సంబంధించి అటు వీడియా.. ఇటు ప‌వ‌న్ లు కాస్త త‌ప్పుగా.. కాస్త రైటుగా వాద‌న‌లు వినిపిస్తున్నారు. వారిద్ద‌రూ ఒక వాస్త‌వాన్ని మ‌ర్చిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. వారి వాద‌న ప్ర‌కారం శ్రీ‌రెడ్డి అస‌భ్య వ్యాఖ్య‌ను టీవీ9.. ఎబీఎన్ ఆంధ్ర‌జ్యోతి తొలుత ఎలాంటి బీప్ లేకుండా టెలికాస్ట్ చేసింద‌ని.. దానిపై కొంత టైం వ‌ర‌కూ అలా వ్య‌వ‌హ‌రించినా..ఆ త‌ర్వాత మాత్రం ఆమె వ్యాఖ్య ద‌గ్గ‌ర బీప్ పెట్టార‌ని చెబుతున్నారు. అయితే.. ప‌వ‌న్ వ‌ర్గం మాత్రం బీప్ లేకుండా ప్ర‌సారం చేసిన వీడియో క్లిప్ ను చూపిస్తున్నారే కానీ.. ఆ త‌ర్వాత బీప్ పెట్ట‌టం.. శ్రీ‌రెడ్డి చేతి వేళ్ల‌తో చూపించిన దానిని బ్ల‌ర్ చేసి ప్ర‌సారం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. వాస్త‌వం ఇదైతే.. అటు మీడియా కానీ ఇటు ప‌వ‌న్ వ‌ర్గం కానీ నిజాన్ని నిజంగా కాకుండా త‌మ వాద‌న‌ను మాత్ర‌మే వినిపిస్తున్న‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. దీనిపై కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.