Begin typing your search above and press return to search.
ఓరినాయనో ఎవరిని నమ్మాల్రా బాబు?
By: Tupaki Desk | 8 Nov 2015 4:46 AM GMTదేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధఇంచి చిత్రమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు అన్న వెంటనే క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితిని మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. అధికారిక ప్రకటనకు సంబంధం లేకుండా మీడియా సంస్థలు తమకున్న నెట్ వర్క్ తో వాయు వేగంతో సమాచారాన్ని చేరవేస్తుంటాయి. ఎన్నికల సమయంలో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఎన్నికల ఫలితాల సమయంలో కాస్త.. నాలుగైదు సీట్ల తేడాతో ఏ పార్టీ అధిక్యంలో ఉంటుందన్న విషయాన్ని మీడయా సంస్థలు దాదాపుగా ఒకేరీతిలోఉంటాయి. కానీ.. బీహార్ ఎన్నికల ఫలితాల విషయంలో మాత్రం సీన్ అందుకు భిన్నంగా ఉంది. తెలుగు వరకు చూస్తే.. ఈనాడు ఫలితాలు లౌకిక మహాకూటమికి అధిక్యంలో ఉందని.. ఎన్డీయే వెనుకబడినట్లుగా ఇచ్చారు. ఇక. సాక్షిలో అందుకు భిన్నంగా ఎన్డీయే అధిక్యంలో ఉన్నట్లు చెప్పి.. ఆ తర్వాత లౌకిక కూటమి అధిక్యంలో ఉన్నట్లు చెప్పటం షురూ చేశారు. ఇక.. ఆంధ్రజ్యోతి సైతం మహాకూటమి అధిక్యంలో ఉన్నట్లే చెప్పింది. టీవీ ఛానళ్ల విషయానికి వస్తే.. తెలుగు వరకే కొన్ని ఛానళ్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక్యంలో ఉన్నట్లుగా పేర్కొంటే.. మరికొన్ని మహాకూటమి అధిక్యంలో ఉన్నట్లు చెబుతున్నాయి.
ఇంగ్లిష్ ఛానళ్లు సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రముఖ మీడియా సంస్థలైన ఎన్డీటీవీలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉందంటే.. టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం అందుకు భిన్నంగా లౌకిక కూటమి అధిక్యంలో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో.. ఎవరు నిజంగా అధిక్యంలో ఉన్నారన్న విషయం తేలటం లేదు. చూస్తేంటే.. ఒకట్రెండు గంటల పాటు ఏ టీవీ చూడకుండా ఉంటే సరిపోతుందన్న భావన కలగటం ఖాయం.