Begin typing your search above and press return to search.
విపక్షాన్ని నెట్టేసి మరీ... జగన్ వర్సెస్ టీడీపీ అనుకూల మీడియా
By: Tupaki Desk | 17 Dec 2022 2:30 AM GMTమీడియా అన్నది తటస్థంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి అంటే ఆ రోజులు పోయాయి. అవి పాత చింతకాయ పచ్చడి మాటలు అని అంతా అనుకునే కాలమిది. ఇక ఒక విషయం జరిగితే దాన్ని మీడియాలో పెట్టి అనుకూలమో వ్యతిరేకమో ప్రచారం చేయడం ఒక పద్ధతి. కానీ ఇపుడు అది కూడా దాటేశారు. మీడియా హౌస్ నడుపుతున్న వారి రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించడానికి తామే వార్తలను వండి వార్చేసి మళ్ళీ దాని మీద డిబేట్లు పెడుతూ ఒక విధంగా అధికార వైసీపీని కార్నర్ చేస్తున్నారు.
దాంతో బేస్ లెస్ గా ఆరోపణలు ఉంటున్నాయని అంటున్నారు. కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్న సందేశం కూడా జనాల్లోకి వెళ్ళిపోతోంది. ఇక ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన వార్తలను పట్టుకుని విపక్షాలు నానా హడావుడి చేస్తున్నాయి. దాంతో విపక్షాన్ని డమ్మీ చేసి మీడియా ఒక పొలిటికల్ అజెండాని క్రియేట్ చేయడం ఏపీలో ఇపుడు జరుగుతోంది. ఈ రకంగా ఆధారం లేని ఆరోపణలు మీడియా నుంచి రావడం, దాన్ని విపక్షాలు పట్టుకుని నానా యాగీ చేయడంతో వాటిని విలువ లేకపోవడంతో పలుచన అవుతున్నారని అంటున్నారు.
ఇక ఈ రకమైన ఆరోపణలను వైసీపీ కూడా తిప్పికొడుతోంది. వైసీపీకి కూడా ఇది సులువుగానే ఉంటోంది. ఎందుకంటే ఆధారాలు సేకరించి చేసే ఆరోపణలు అయితే వాటి మీద స్టడీ చేయాలి. తిరిగి సమర్ధంగా తిప్పుకొట్టాలి. అలా కాకుండా కావాలని బురద వేస్తే అంతే వేగంగా తిప్పికొట్టడం అవుతుంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే విపక్షాలు కూడా ఒకప్పుడు జనంలో ఉంటూ పోరాడేవి. ప్రజా సమస్యలను అవి తెలుసుకునేవి.
దాని కోసం శ్రమించేవి. కానీ ఇపుడు మీడియాలో వచ్చిన వాటికే వల్లించడం అలవాటు అయ్యాక విపక్షాలు కూడా జనంలో పలుచన అవుతున్నాయి. దానికి ఈ మధ్యన జరిగిన ఇప్పటం ఉదంతం ఒక సాక్ష్యం. అక్కడ లేని దానిని ఉన్నట్లుగా చూపించి ముందు మీడియా హడావుడి చేసింది. దాన్ని పట్టుకుని వెళ్ళిన విపక్షాలు చివరికి అభాసుపాలు అయ్యాయి. ఇలాంటివే ఏపీలో చాలా జరుగుతున్నాయి. దాని వెనక మీడియా రాజకీయ ఆకాంక్షలు వేరే ప్రయోజనాలు ఉండడంతో జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు.
ఇంకో వైపు చూస్తే జగన్ అధికారంలో రాక ముందు ఎలా ఉన్నా వచ్చిన కొత్తల్లో మాత్రం టీడీపీ అనుకూల మీడియా ను పెద్దగా పట్టించుకోలేదు. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం ఇదే అదను అనుకుని రెచ్చిపోతోంది. అంతే కాదు రాయాల్సింది తాము అనుకున్నది చెప్పాల్సింది అన్నీ చేస్తోంది. దాంతోనే జగన్ కూడా తన రూట్ మార్చారు. ఆయన ఇటీవల సభలలో అయితే మీడియాను నేరుగా టార్గెట్ చేసుకుని విమర్శించడానికి కారణం ఇదే అంటున్నారు.
జగన్ కి ఆ విధంగా మీడియాలోని ఒక వర్గం అతి కోపం తెప్పిస్తోంది అని అంటున్నారు. ఏపీ రాజకీయాన్ని సాఫీగా సవ్యంగా సాగనీయకుండా మధ్యలో మీడియా రావడాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి ప్రభుత్వం మీద విపక్షాలు పోరాడడం సబబు. ఎక్కడైనా అదే జరుగుతోంది. కానీ ఇక్కడ విపక్షం కంటే కూడా తట్టుకోలేనంత అసహనం ఒక వర్గం మీడియాలో కనిపిస్తోంది అని అంటున్నారు. జగన్ ఏలుబడి వారికి నచ్చకపోవడం వల్ల ప్రతీ రోజూ పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు వండి వార్చుతున్నారని, అవి కాస్తా విపక్షం నోట పలికిస్తున్నారని, తిరిగి అవే వార్తలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు అని అంటున్నారు.
రాజకీయాల్లో మీడియా పాత్ర ఒక రిఫరీగా ఉండాల్సిది అది పోయి ఇపుడు తానే ఆటలోకి దిగిపోవడాన్ని ఏపీలో విపక్షం అజెండాను సెట్ చేయడానికి తాపత్రయపడడాన్ని కూడా వైసీపీ అధినాయకత్వం చూస్తూ ఊరుకోలేక మండిపోతోంది అని అంటున్నారు. ఈ విధంగా తనది కాని పనిలో తనకు సంబంధం లేని దాంట్లో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల ఏపీలో కొన్ని విభిన్నమైన పరిణామాలు సంభవించాయని అంటున్నారు. ఒకటి విపక్షం క్రియాశీలంగా లేకపోవడం, రెండు బలమైన విపక్షాన్ని డమ్మీని చేసి పారేసి తానే ఒక వర్గం మీడియా ముందుకు రావడం, మూడు బేస్ లెస్ వార్తల వల్ల మీడియా విశ్వసనీయత తగ్గిపోవడం అని అంటున్నారు.
ఇలాగే ఒక వర్గం మీడియా మరింత రెచ్చిపోతే ఉన్న దానికీ లేనిదానికి మీదపడి విరుచుకుపడితే మాత్రం ఏపీలో తిరిగి వైసీపీకే అది పాజిటివ్ గా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకంటే ఉన్న దాన్ని కొంత పెద్దది చేయవచ్చు. లేనిదాన్ని ఎంత చేసి చూపించినా ప్రయోజనం లేకపోగా రేపు ఇంతకు ఇంత జరిగినా కూడా జనాలు పట్టని పరిస్థితికి వస్తారు. ఆ రకంగా ఏపీ రాజకీయాల్లో ఒక సెక్షన్ మీడియా ఆరాటం పోరాటం అంతా కలసి రాజకీయ చిత్రాన్నే మార్చేస్తున్నాయని అంటున్నరు. ఇది అంతిమంగా విపక్షానికే నష్టం కలిగించే ప్రమాదం ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.