Begin typing your search above and press return to search.
ఉప్మా మాటే.. డ్రగ్స్ ఎపిసోడ్ లోనూ..!
By: Tupaki Desk | 16 July 2017 8:34 AM GMTడ్రగ్స్ కేసుకు సంబంధించి గడిచిన మూడు.. నాలుగు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రింట్ మీడియాతో పోలిస్తే.. ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రగ్స్ రచ్చకు ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ మధ్యన వచ్చిన పోకిరి సినిమా గుర్తుందా? అందులో హీరో పాత్రధారి.. హీరోయిన్ తరచూ ఉప్మా తీసుకురావటం చూసి.. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా మీద బతికేస్తుందంటూ పంచ్ వేస్తాడు. ఈ పంచ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా.. డ్రగ్స్ ఎపిసోడ్ లో ఎలక్ట్రానిక్ మీడియా ముచ్చట చూస్తే.. ఈ డైలాగ్ మరోసారి గుర్తుకురాక మానదు. గడిచిన మూడు.. నాలుగు రోజులుగా మరేదీ ముఖ్యం కానట్లు డ్రగ్స్ మీద టీవీ ఛానళ్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కొన్ని న్యూస్ ఛానళ్లు అయితే.. మరింతగా దూసుకెళుతూ.. సినీ ప్రముఖులకు సంధిస్తున్న ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సందట్లో సడేమియా అన్నట్లు సినీ పరిశ్రమకు చెందిన పలువురు మీడియాకు నీతులు చెప్పటం షురూ చేస్తున్నారు. మీడియా అలా ఉండాలి.. ఇలా ఉండాలంటూ వారి నీతి బోధనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ మీద ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్న వేళ.. అందుకు రిటార్ట్ ఇచ్చే రీతిలో కొన్ని ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు చెబుతున్న మాటలు ఇప్పుడు సరికొత్తగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. డ్రగ్స్ కేసు సంగతేమో కానీ.. ఈ పేరుతో టీవీ ఛానళ్లు అవసరమైన మేత దొరికిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా మీద బతికేస్తున్నారన్నట్లే.. తాజాగా తెలుగు న్యూస్ ఛానళ్లలో చాలావరకూ డ్రగ్స్ ముచ్చట మీదే బండి లాగించేస్తున్నారన్న జోక్ ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ..పాత్రికేయుల్లోనూ.. ప్రజల్లోనూ వినిపిస్తోందని చెప్పక తప్పదు.