Begin typing your search above and press return to search.
అమ్మకానికి నిషిత్ యాక్సిడెంట్ వీడియో!
By: Tupaki Desk | 12 May 2017 7:10 AM GMTప్రాశ్చాత్య దేశాల్లో కనిపించే వ్యవహారం ఇప్పుడు మన దగ్గరా కనిపిస్తోంది. మిగిలిన విషయాల్లో ఎలా అయితే.. పాకిపోతుందో.. ఇప్పుడు పాపరాజ్జీ కూడా మన ముగింట్లోకి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని రహస్యంగా చిత్రీకరిస్తూ.. వాటిని మీడియాకు అమ్ముకొని సొమ్ము చేసుకునే వారిని ముద్దుగా పారాజ్జీగా వ్యవహరిస్తుంటారు.
మన మీడియాలో ఇలాంటి వాటికి స్థానం దాదాపుగా లేదనే చెప్పాలి. ప్రాశ్చాత్య దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో మరణించిన బ్రిటన్ యువరాణి డయానా కూడా ఈ పాపరాజ్జీ వారి కారణంగానే మరణించిందన్న వాదన ఉంది. ప్రముఖుల్ని వెంటాడి.. వేటాడి మరీ వీరికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు తీస్తుంటారు. తాజాగా ఈ తరహాలో కాకుండా.. దీన్ని గుర్తు చేసే ఘటన ఒకటి చోటు చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతికి సంబంధించిన వీడియో ఫుటేజ్ తన దగ్గర ఉందంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఒక వ్యక్తి ఫోన్ చేయటం చర్చనీయాంశంగా మారింది. మనదగ్గరున్న సంస్కృతి ప్రకారం.. ఇలాంటి వీడియోలు.. ఫోటోలు ఉన్నప్పుడు వెంటనే మీడియాకు అందజేసి.. ప్రజలకు చేరవేస్తుంటారు. తాజా ఉదంతంలో మాత్రం.. తమ దగ్గరున్న వీడియో ఫుటేజ్ ఇవ్వాలంటే.. తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పారట.
తమ దగ్గర ఉన్న వీడియోను కొంటారా? అంటూ సదరు మీడియా సంస్థకు మొయిల్ చేయటమేకాదు.. ఆధారాలు చూపించమంటే.. ప్రమాదానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని సదరు మీడియా సంస్థకు పంపారట. అయితే.. తాము ఆ వీడియో ఫుటేజ్ విషయాన్ని కొనుగోలు చేశారా? లేదా? అన్న విషయాన్ని సదరు మీడియా సంస్థ వెల్లడించలేదు. కాకుంటే.. సంచలన అంశాలకు సంబంధించిన వీడియోను అమ్మకానికి పెట్టిన వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/