Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ పొగ‌డ్త‌లు ఎందిరా నాయ‌నా?

By:  Tupaki Desk   |   3 Sep 2018 5:44 AM GMT
వామ్మో.. ఈ పొగ‌డ్త‌లు ఎందిరా నాయ‌నా?
X
భారీ హైప్ క్రియేట్ అయి.. ఏదేదో అవుతుంద‌ని అంచ‌నాలకు భిన్నంగా ఏమీ కాకుండా పోవ‌ట‌మే కాదు.. మొద‌టికే మోసం వ‌చ్చేలా సాగింది ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌. ప్ర‌త్య‌ర్థుల్ని డిఫెన్స్ లో ప‌డేసి.. తెలంగాణ అధికార‌ప‌క్షం తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌న్న భావ‌న ప‌లువురిలో వ్య‌క్త‌మైంది.

గంట‌న్న‌ర పాటు సాగుతుంద‌ని భావించిన కేసీఆర్ ఉప‌న్యాసం కేవ‌లం 48 నిమిషాల‌కే ప‌రిమితం కావ‌టం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ స్పీచ్ లో ఆయ‌న మార్క్ అయిన పంచ్ లు.. పిట్ట‌క‌థ‌లు.. క‌వ్వింపులు.. వ్యంగ్యాస్త్రాలు లాంటివేమీ లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఎప్పుడూ క‌నిపించ‌నంత నీర‌సంగా కేసీఆర్ క‌నిపించార‌ని చెప్పాలి.

ఏదో తెలీని స‌మ‌స్య కేసీఆర్ ను నిన్న రాత్రి వెంటాడింద‌న్న అభిప్రాయం ప‌లువురిలో వ్య‌క్త‌మైంది. భారీ అంచ‌నాలున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కాస్తా.. భారీ ఫ్లాప్ షో అన్న అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకుంది. కేసీఆర్ ప్ర‌సంగం విన్న త‌ర్వాత‌.. ఆయ‌న ఇంత శ్ర‌మ‌కూర్చి స‌భ పెట్టే క‌న్నా.. చ‌ప్పుడు చేయ‌కుండా భారీ మీడియా స‌మావేశం పెట్టినా.. ఇంత‌కు మించిన మైలేజీ వ‌చ్చేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ ప్ర‌సంగాన్ని టీవీల్లో చూసిన చాలామంది.. ఈ రోజు ఉదయం పేప‌ర్లో ఏం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని ఆస‌క్తిగా చూశారు. మ‌రికొంత మంది.. రేపు పేప‌ర్ల‌లో అన్ని కేసీఆర్ ను పిసికేయ‌ట‌మే కానీ.. స‌భ పెద్ద‌గా జ‌ర‌గ‌లేద‌ని.. కేసీఆర్ స్పీచ్ హైలెట్ కాలేద‌ని.. ఎప్పుడూ లేనంత సింఫుల్ గా స్పీచ్ ను తేల్చేసిన విష‌యాన్ని.. ఎంతో శ్ర‌మ‌కూర్చి వ‌చ్చిన టీఆర్ ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యార‌న్న మాట‌ల్ని మొత్తంగా కాకున్నా.. కొంత‌మేర అయినా రాస్తార‌ని ఊహించారు. కానీ.. ఎవ‌రూ అంత సాహ‌సానికి పూనుకోక‌పోవ‌టం చూసిన‌ప్పుడు.. తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప‌రిస్థితి మ‌రీ ఇంత దారుణంగా ఉందా? అన్న భావ‌న ఈ రోజు ప‌త్రిక‌ల్ని చూసినోళ్ల‌కు ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

మీడియా సంస్థ‌ల‌న్నీ మ‌ర్చిపోతున్న సింఫుల్ లాజిక్ ఏమిటంటే..తాము ఏం రాస్తే అదే భ‌గ‌వ‌ద్గీత .. ఖురాన్.. బైబిల్ అన్న రోజులు పోయాయి. సోష‌ల్ మీడియా సామాన్యుల చేతుల్లోకి వ‌చ్చేసింది. ఎవ‌రికి ఏమ‌నిపిస్తే అది రాసేసే ప‌రిస్థితి. గ‌తంలో మాదిరి సెన్సార్ లు ఉండ‌వు. దీంతో.. మెజార్టీ వ‌ర్గానికి ఏదైనా అంశంపై ఒక క్లారిటీ వ‌చ్చినా.. ఒక అవ‌గాహ‌నకు వ‌చ్చినా ఆ విష‌యాల్ని సోష‌ల్ మీడియాలో ఓపెన్ గా వ్య‌క్తం చేస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. లేనిపోనివి రాస్తే.. ఉన్న పేరు ప్ర‌ఖ్యాతులు పోయి.. విశ్వ‌స‌నీయ‌త గాల్లో దీపంలా మారుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ప్ర‌గ‌తి నివేద‌న అన్న‌ది సూప‌ర్ హిట్ షో అని.. కేసీఆర్ ప్ర‌సంగానికి ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్న రాత‌లు రోత‌గా మారతాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.కేసీఆర్ భ‌జ‌న మోజులో ప‌డి వాస్త‌వాల్ని మ‌ర్చిపోతే.. రానున్న రోజుల్లో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్ని త‌మ మీద ప్ర‌జ‌ల‌కున్న విశ్వ‌న‌సీయత మొత్తంగా పోతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కేసీఆర్ మీద అదే ప‌నిగా తిడుతూ రాయాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి మీదైనా అన‌వ‌స‌ర‌మైన ప్రేమ‌..అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తే భ‌రించే రోజులు పోయాయి. త‌మ‌ను మోసం చేస్తున్నారు..త‌మ‌కు తెలిసిన నిజాన్ని సైతం మ‌సిపూసి మారేడు కాయ చేస్తున్నాడ‌న్న భావ‌న క‌లిగితే మొద‌టికే మోసం అవుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.