Begin typing your search above and press return to search.
ఆ ఛానెళ్లు పవన్ విషయంలో ఏం చేస్తాయ్?
By: Tupaki Desk | 11 May 2018 2:30 PM GMTసినీ జనాలకు.. మీడియాకు మధ్య ఎన్నడూ లేనంత అగాథం ఏర్పడిపోయింది ఈ మధ్య. ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూ విషయంలో రెండు వర్గాల జరిగిన రగడ అంతా ఇంతా కాదు. ఆ వివాదం మరీ హద్దులు దాటి కొన్ని న్యూస్ ఛానెళ్లు.. వాటి యజమానుల మీద పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించే స్థాయికి చేరింది. ఓ వారం పాటు వాళ్లను గట్టిగా టార్గెట్ చేశాడు పవన్. ఆ ఛానెళ్లు సైతం పవన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ అతడికి కవరేజీ ఇవ్వడం మానేశాయి. కొన్ని రోజుల పాట ఛానెళ్లలో పవన్ పేరే కనిపించకుండా పోయింది. కానీ నిన్న ‘నేల టిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ రావడం.. ఆ వేడుక టెలికాస్ట్ హక్కులు పవన్ తీవ్రంగా వ్యతిరేకించన ఛానెలే తీసుకోవడం.. ఈ వేడుకను ప్రసారం చేయడం.. పవన్ కనిపించడం.. జనాలు ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా వైఖరిపై జనాలకు అయోమయం నెలకొంది.
పవన్ తో చర్చలేమైనా జరిగి రాజీకి వచ్చారా.. లేక ఈ వేడుక హక్కులు తీసుకున్నాం కాబట్టి దీని వరకు టెలికాస్ట్ చేద్దాం అనుకున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఈ వేడుక సంగతి సరే.. మున్ముందు పవన్ కళ్యాణ్ విషయంలో వివిధ ఛానెళ్లు ఎలా వ్యవహరించబోతున్నాయన్నది ఆసక్తికరం. తమను అంతగా టార్గెట్ చేసి.. వ్యక్తిగత దూషణలు చేసిన పవన్ కు కవరేజీ ఇచ్చి మైలేజీ పెంచడం ఎందుకని ఛానెళ్లు బహిష్కరణ మంత్రం పాటించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి జనాకర్షణ వ్యక్తి జనాల్లోకి వెళ్తుంటే ఉండే హంగామాను కవర్ చేయకపోవడం ఛానెళ్లకూ నష్టమే. పవన్ ఫిలిం ఛాంబర్ కు వెళ్లిన రోజు దాన్ని అవాయిడ్ చేసి.. చంద్రబాబు దీక్షకు కవరేజీ ఇచ్చిన ఛానెళ్లు టీఆర్పీ విషయంలో తమను తామే దెబ్బ తీసుకున్నాయి. పవన్ కార్యక్రమం ప్రసారం చేసిన ఛానెళ్లకు మాంచి టీఆర్పీ రాగా.. వీటికి నామమాత్రంగా వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే పవన్ ను ఛానెళ్లు పూర్తిగా బహిష్కరించే పరిస్థితి లేదు. వాస్తవంగా చెప్పాలంటే పవన్ కు మీడియా అవసరం.. మీడియాకు పవన్ అవసరం. మరి మున్ముందు ఈ ఇద్దరిలో ఎవరెంత పట్టుదలకు పోతారో.. ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.