Begin typing your search above and press return to search.
ఇంతకీ డెన్.. డాన్ అన్నది ఎవరు?
By: Tupaki Desk | 19 March 2015 6:29 AM GMTఏపీ రాజకీయం హద్దులు దాటుతున్న వైనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ తీవ్రస్థాయి ఆరోపణలు.. విమర్శలకు పరిమితమైన వారు బాహాటంగా బూతులు తిట్టుకోవటం కనిపిస్తోంది.
ఏపీ అధికారపక్షానికి చెందిన ఎమ్మేల్యే బండా ఉమామహేశ్వరరావు ఏంట్రా.. ఏంట్రా.. పాతరేస్తా.. అన్న మాటలు టీవీల్లో వచ్చేశాయి. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బండా ఉమా ఈ స్థాయిలో విరుచుకుపడినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా తీరుకు సంబంధించిన సీడీల్ని ఏపీ చీఫ్ విప్ విడుదల చేయటం సంచలనంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఒక కథనం ఆశ్చర్యం రేకెత్తించేలా ఉండటం విశేషం. ఏపీ శాసనసభ ఒక డెన్ గా మారిందని.. ఆ డెన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శతో ఒక కథనం వచ్చింది.
ఇంతకీ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయం సదరు కథనంలో లేకపోవటం గమనారÛం. మీడియా విశ్వసనీయత మీద ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలా బాధ్యతారాహిత్యంతో కథనాలు అందించటం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. సున్నిత అంశాలకు సంబంధించి.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వ్యక్తులపై చేసే విమర్శలు.. ఆరోపణలను.. వాటిని చేసే వ్యక్తుల స్థాయి ఆధారంగా చేయటం తెలిసిందే. అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా ప్రచురించేయటం మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది.