Begin typing your search above and press return to search.
కోదండం మాష్టారిపై ‘మీడియా’ అప్రకటిత బ్యాన్?
By: Tupaki Desk | 29 Dec 2016 7:30 PM GMTఎప్పుడూ ఒకేలా ఉంటే అది కాలం ఎందుకు అవుతుంది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం మామూలే. జస్ట్ టైమ్ గ్యాప్ లో చాలానే జరిగిపోతుంటాయి. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో టీజేఏసీ చీఫ్ గా వ్యవహరించిన కోదండం రాం మాట ఎంత పవర్ ఫుల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నేతృత్వం వహించే జేఏసీ సమావేశం అయినా.. మీడియాలు లైవ్ లు ఇచ్చే పరిస్థితి.
ఇక.. ఆయన నోటి నుంచి ఏదైనా నిరసన కార్యక్రమం కానీ.. పిలుపు కానీ వస్తే దానికి మీడియా ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దేశంలో కానీ.. ప్రపంచంలో కానీ ఏం జరిగినా పట్టించుకోని మీడియా.. కేవలం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కోదండరాం ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తే.. గంటల కొద్దీ ఆ కార్యక్రమాల్ని చూపిస్తూ ఉండేవి.
టీవీ ఛానళ్లలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ప్రింట్ మీడియాలోనూ ఇలాంటి పరిస్థితే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిమాటకు విపరీతమైన విలువను ఇస్తూ.. మొదటిపేజీలో ప్రాధాన్యతలో ఇచ్చే వారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిమాట అమూల్యం అన్నట్లుగా ఉండేది. అలాంటి కోదండం మాష్టారు ఈ రోజు తెలంగాణ అధికారపక్షంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా.. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. అదెక్కడో లోపల చాలా చిన్న వార్తగా ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఉద్యమ సమయంలో కోదండం పలుకే బంగారమన్నట్లుగా అమితంగా ప్రాధాన్యం ఇచ్చిన ప్రముఖు మీడియాలు ఇప్పుడాయన్ను అస్సలు కవర్ చేయకపోవటం.. ఒకవేళ కవర్ చేసినా తూతూ మంత్రంగా వార్తల్ని ఇవ్వటం చూస్తే.. ఆయనపై అప్రకటిత బ్యాన్ ఏమైనా ఉందా? అన్న సందేహం కలిగిస్తోంది.
చివరకు పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే.. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా.. కనీసం ఫోటో కూడా అచ్చేయకుండా.. సింగిల్ కాలమ్ వార్తగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి. దీంతో.. ఆయన గళం విప్పినా.. అదేదీ ప్రజలకు సరిగా చేరని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/