Begin typing your search above and press return to search.

ఉదారంగానా?; మోడీ ఏడాది పాలనకు మంచి మార్కులు

By:  Tupaki Desk   |   25 May 2015 5:57 AM GMT
ఉదారంగానా?; మోడీ ఏడాది పాలనకు మంచి మార్కులు
X
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాలన మొదలై ఏడాది పూర్తి కానుంది. కోటి ఆశలతో మోడీ సర్కారును భారత ప్రజలు అత్యధిక మెజార్టీ కట్టబెడితే.. ఆ అంచనాలకు తగినట్లుగా మోడీ పాలన లేదని సామాన్యుడి ఫీలింగ్‌. అదేసమయంలో.. మోడీ సర్కారు ఏడాది పాలనపై పలు మీడియా సంస్థలు సర్వే నిర్వహించాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మోడీ ఏడాది పాలనకు అందరూ ఇంచుమించు ఫస్ట్‌క్లాస్‌ మార్కులు ఇవ్వగా.. మరికొన్ని మీడియా సంస్థలైతే.. ఏకంగా డిస్టింక్షన్‌కు కాస్త దగ్గరగా మార్కులు ఇచ్చేయటం గమనార్హం. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే.. సిసిరో నిర్వహించిన సర్వేలో 56 శాతం మంది మోడీ సర్కారు బాగుందని కితాబు ఇచ్చినట్లు పేర్కొంది. అసోచామ్‌ కూడా మోడీ ఏడాది పాలనకు మంచి మార్కులే వేసింది.

మరోవైపు.. ఐబీఎన్‌ సర్వే మాత్రం మోడీ ఏడాది పాలన సూపర్‌ అంటూ ఏకంగా 72 శాతం మంది పేర్కొనటం విశేషం. ఇక.. మోడీ ఏడాది పాలనలో ప్రముఖంగా వినిపించిన స్వచ్ఛభారత్‌ చాలా.. చాలా బాగుందంటూ 85 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారని సదరు సంస్థ పేర్కొంది.

ఈ రెండు సంస్థలతో పాటు.. పలు ఇతర మీడియా సంస్థలు సైతం సర్వేలు నిర్వహించాయి. అన్నింట్లోనూ ఫస్ట్‌క్లాస్‌ మార్కులకు కాస్త అటూఇటూగా మార్కులు రావటం గమనార్హం. మొదటి ఏడాది కాబట్టి.. కాస్తంత ఉదారంగా మోడీకి.. ప్రజలు మార్కులు వేశారా? అన్న భావన వ్యక్తమవుతోంది కూడా.