Begin typing your search above and press return to search.
హెలికాఫ్టర్ లో సీఎంతో మీడియా అధినేత!
By: Tupaki Desk | 3 Oct 2017 4:50 AM GMTఅంగరంగ వైభంగా జరిగిన పరిటాల శ్రీరామ్ పెళ్లి వేడుకకు సంబంధించిన చాలానే వార్తలు వచ్చాయి. ప్రత్యేక కథనాలు చాలానే మీడియాలో వచ్చాయి. అయితే.. ఈ పెళ్లికి సంబంధించి ఒక కీలక విషయం మాత్రం మీడియాలో కనిపించలేదు.
పరిటాల వారింట జరిగిన పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ మాటకు వస్తే.. పెళ్లికి వచ్చిన వారు.. కేసీఆర్ ను చూసేందుకు ఎగబడటమే కాదు.. కేసీఆర్ ను చూసి కేరింతలు కొట్టిన వైనం కనిపించింది.
దీనికి టీఆర్ ఎస్ వర్గాలు ఫుల్ హ్యాపీ కావటం తెలిసిందే. మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా ట్వీట్ చేసిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ పెళ్లికి కేసీఆర్ వెంట వెళ్లిన మంత్రి తుమ్మల గురించి వార్తల్లో వచ్చినా.. ఆయన వెంట వెళ్లిన మరో మీడియా అధినేత గురించి ఎక్కడా ప్రస్తావన రాకపోవటం గమనార్హం.
ఉద్యమ సమయంలో కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ.. ఉద్యమానికి చేయూతగా నిలిచిన సదరు మీడియా అధినేత తర్వాతి కాలంలో ఆయన పేరు వింటనే అగ్గి మీద గుగ్గిలం అయిన పరిస్థితి. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నా ఇగోతో ఇబ్బంది అని చెబుతారు. అయితే.. ఆ మధ్యన కేసీఆర్ నిర్వహించిన యాగం సమయంలో వారిద్దరి మధ్య ప్యాచప్ అయ్యిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
యాగం తర్వాత నుంచి కేసీఆర్ మీద సదరు మీడియా అధినేత మీడియాలో వ్యతిరేక వార్తలు తక్కువ కావటం ఎక్కువైంది. కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలతో పాటు.. కొన్ని సందర్భాల్లో అధికారపార్టీకి చెందిన వార్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం.. సీఎం వ్యతిరేకుల వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోటం లాంటివి సదరు మీడియా అధినేత చేస్తున్నట్లుగా చెబుతారు. దమ్ము మీద తరచూ మాట్లాడే సదరు మీడియా అధినేత.. తాజాగా పరిటాల వారింట జరిగిన పెళ్లికి సీఎం కేసీఆర్ తో పాటు హెలికాఫ్టర్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వ్యవహారం వార్త రూపంలో ఎక్కడా కనిపించకపోవటం గమనార్హం.