Begin typing your search above and press return to search.

సీఎం కాళ్లు ప‌ట్టుకున్న విలేక‌రి

By:  Tupaki Desk   |   1 Jan 2018 11:20 AM GMT
సీఎం కాళ్లు ప‌ట్టుకున్న విలేక‌రి
X
ప్ర‌శ్నించేవాడు పాత్రికేయుడు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో నాలుగో స్తంభంగా అభివ‌ర్ణించే పాత్రికేయ‌టం తామ‌రాకు మీద నీటి బొట్టులా ఉండాల‌ని చెబుతారు. పేరుకు ఉద్యోగే అయిన‌ప్ప‌టికీ.. స‌మాజానికి ప్ర‌తినిధిగా.. ప్ర‌జ‌ల సొమ్ముకు వాచ్ డాగ్ లా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అలాంటి పాత్రికేయుడు సీఎం కాదు.. పీఎంల‌ను సైతం త‌న ప్ర‌శ్న‌ల‌కు తిక‌మ‌క పెట్టే స‌త్తా వారి సొంతం.

అలాంటి పాత్రికేయం ఇప్పుడు ఎంత ద‌రిద్రంగా.. ఛండాలంగా త‌యారైందో చెప్పే ఉదంతం తాజాగా యూపీలో చోటు చేసుకుంది. ఎప్పుడైతే రాజ‌కీయ పార్టీలు మీడియా సంస్థ‌ల్ని నిర్వ‌హించ‌టం మొద‌ల‌య్యాయో.. అప్ప‌టి నుంచో మీడియా సంస్థ అన్నా.. పాత్రికేయుల‌న్నా రాజ‌కీయ నాయ‌కుల‌కు చుల‌క‌న భావం పెరిగిపోయింది.

దీనికి తోడు మీడియా సంస్థ‌ల క‌క్కుర్తి పుణ్య‌మా అని అర‌కొర జీతాల కార‌ణంగా.. అవ‌స‌రాలు తీర్చుకోవ‌టం కోసం కాస్త క‌ట్టుత‌ప్పే జ‌ర్న‌లిస్టులు కొంద‌రు క‌నిపిస్తుంటారు.

ఇంత చేసినా.. ఎక్క‌డా త‌మ గీత‌ను.. వృత్తిలో త‌మ విధి నిర్వ‌హ‌ణ విష‌యంలో అంతో ఇంతో క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడా హ‌ద్దులు చెరిగిపోయే ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. వైర‌ల్ అయితే వీడియో ఇప్పుడు హ‌డావుడి చేస్తోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు ఏసియ‌న్ న్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ విలేక‌రి. ముఖ్య‌మంత్రి మ‌నసు దోచుకోవాల‌నుకున్నాడో.. లేక‌.. స‌రికొత్త సంప్ర‌దాయాన్ని స్టార్ట్ చేయాల‌నుకున్నాడో కానీ.. ముఖ్య‌మంత్రి కాళ్ల‌కు దండం పెట్టిన వైనం తాజాగా వైనం వైర‌ల్ అయ్యింది. ఒక చేత్తో ఛాన‌ల్ లోగో.. మ‌రో చేత్తో వంగి మ‌రీ ముఖ్య‌మంత్రి కాళ్ల‌కు దండం పెట్టిన వైనం చూస్తే.. రానున్న రోజుల్లో పాత్రికేయానికి మ‌రెన్ని పాడు రోజులు రానున్నాయో ఈ ఉదంతం చెప్పేస్తుంద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.