Begin typing your search above and press return to search.
సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం మీడియాధినేత వెయిటింగ్!
By: Tupaki Desk | 11 Sep 2019 3:53 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియా మేనేజ్ మెంట్ మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో మెజారిటీ మీడియా జగన్ కు వ్యతిరేకమే అనే సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. జగన్ మీద అక్కసు వెల్లగక్కే మీడియా సంస్థలే అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పథకాలను ప్రవేశ పెట్టినా వాటిపై చెడుగా ప్రచారం చేయడానికే తెలుగుదేశం అనుకూల మీడియా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్రభుత్వ ప్రయత్నాలను నీరుగార్చడానికి టీడీపీ మీడియా ద్వారా అన్ని కుయుక్తులనూ ఇప్పటికే అమలు పరుస్తోంది కూడా.
ఇలాంటి నేపథ్యంలో మీడియా గురించి జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారుల వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై సమీక్ష నిర్వహిచడానికి జగన్ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు మీడియాధిపతులు జగన్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తూ ఉన్న వైనం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం.
ఎన్టీవీ అధిపతి - హెచ్ ఎం టీవీ - ఏపీ ట్వంటీ ఫోర్..వంటి మీడియా వర్గాలు ముఖ్యమంత్రితో ముఖాముఖి కోసం ఉత్సాహంగా ఉన్నాయట. అయితే ఇప్పటి వరకూ జగన్ ఎవరినీ కలిసింది లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారికి అపాయింట్ మెంట్స్ లభిస్తాయా.. అనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఇక వంద రోజుల పాలన ముగించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఆయన సొంత మీడియా సంస్థ సాక్షి ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేయగా..ప్రస్తుతానికి జగన్ అంత ఆసక్తి చూపనట్టుగా తెలుస్తోంది. ఏడాది పూర్తయ్యాకా అలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వాలని సీఎం అనుకుంటున్నారట. అప్పటికి పాలనతో మార్పును చూపించడానికి వీలవుతుంది అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.