Begin typing your search above and press return to search.

భారీ జాబితాతో మీడియాకు దిమ్మ తిరిగే పంచ్‌!

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:30 AM GMT
భారీ జాబితాతో మీడియాకు దిమ్మ తిరిగే పంచ్‌!
X
ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళుతున్న‌ట్లుగా స్మెల్ చేసిన తెలుగు మీడియా.. కీల‌క‌మైన చాలా అంశాల‌ను ముందుగా గుర్తించ‌లేక‌పోయింద‌ని చెప్పాలి. తోపుల‌మంటూ తొడ‌లు కొట్టుకునే ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు చాలానే కేసీఆర్ ముంద‌స్తు ఎపిసోడ్‌ లో ప‌లుమార్లు బొక్క‌బోర్లా పడిన ప‌రిస్థితి.

ముంద‌స్తుకు కేసీఆర్ వెళుతున్నారంటూ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా తేల్చి చెప్పిన ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆంధ్ర‌జ్యోతి ఒక్క‌టి మాత్ర‌మే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌గా పేరున్న మీడియాలో అయితే ముంద‌స్తు లేనే లేదంటూ భారీ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించారు. ఆ త‌ర్వాత త‌మ త‌ప్పును తెలుసుకొని స‌ర్దుబాటు చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి అసెంబ్లీ ర‌ద్దును ఎప్పుడు చేస్తార‌న్న డేట్ ను తొలిసారిగా ప‌క్కాగా చెప్పింది ఆంధ్ర‌జ్యోతి మాత్ర‌మేన‌ని చెప్పాలి.

అసెంబ్లీ ర‌ద్దు రోజున‌.. కేబినెట్ స‌మావేశం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ఆరున్న‌ర గంట‌ల ముందు అని చాలా మీడియా సంస్థ‌లు రాసినా..అలాంటిదేమీ లేదు.. మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర రెండు గంట‌ల మ‌ధ్య‌లో అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న విష‌యాన్ని ఆంధ్ర‌జ్యోతి మాత్ర‌మే చెప్ప‌గ‌లిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముంద‌స్తు ఎపిసోడ్ లో వ‌రుస పెట్టి స్కోర్లు చేసిన ఆంధ్ర‌జ్యోతి.. కేసీఆర్ అభ్య‌ర్థుల జాబితా ఇంత భారీగా ఉంటుంద‌న్న విష‌యాన్ని స్మెల్ చేయ‌లేక‌పోయింది.

నిజానికి ఆ ఒక్క సంస్థ మాత్ర‌మే కాదు.. తెలుగు.. ఇంగ్లిషు మీడియాతో స‌హా ఏ సంస్థ కూడా జాబితా విడుద‌ల‌పై కేసీఆర్ ఎత్తుగ‌డ‌ను ఊహించ‌లేక‌పోయారు. 105 మంది అభ్య‌ర్థుల‌తో తొలిజాబితాను విడుద‌ల చేసిన కేసీఆర్ మీడియా సంస్థ‌ల‌కు భారీగా షాక్ ఇవ్వ‌ట‌మే కాదు.. ముంద‌స్తుపైనా.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ప్లాప్ అయ్యిందంటూ విప‌క్ష నేత‌లు చేస్తున్న వార్త‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన మీడియాపై త‌న క‌సిని కేసీఆర్ తీర్చుకున్నార‌ని చెప్పాలి. ఏది ఏమైనా.. అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల విష‌యంలో అన్ని మీడియా సంస్థ‌లు హోల్ సేల్ గా ఫెయిల్ అయ్యాయ‌ని చెప్పాలి. కేసీఆర్ వ్యూహాల్ని ప‌సిగ‌ట్టే విష‌యంలో మీడియా ఎంత వెనుక‌బ‌డి ఉంద‌న్న‌ది భారీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.