Begin typing your search above and press return to search.
యూనివర్సిటీ పేరు మార్చడం అంత తేలిక కాదా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే!
By: Tupaki Desk | 22 Sep 2022 11:30 AM GMTవిజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా జగన్ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో అటు అసెంబ్లీ, ఇటు శాసనమండలిలో ప్రభుత్వం పేరు మార్పు బిల్లును కూడా ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు, వైఎస్సార్సీపీలో కొంతమంది నేతలతోపాటు వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
కాగా జగన్ ప్రభుత్వం బిల్లు ఆమోదింపజేసుకున్న మాత్రాన యూనివర్సిటీ పేరును మార్చడం అంత తేలిక కాదని వైద్య నిపుణులు, విద్యావేత్తలు చెబుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంత తేలికైన విషయం కాదని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి గుర్తింపు ఉండడంతో కొత్త పేరుకు అంతర్జాతీయంగా గుర్తింపు రావాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పేరు మార్పుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తదితర సంస్థలు కమిటీలను నియమించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ కమిటీల సభ్యులు యూనివర్సిటీకి పెట్టిన కొత్త పేరును గుర్తించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
అంతేకాకుండా కొత్త పేరుతో యూనివర్సిటీకి గుర్తింపు రావడానికి ఎంత లేదనుకున్నా కనీసం నాలుగేళ్లు పడుతుందని వైద్య నిపుణులు, విద్యావేత్తలు చెబుతున్నారు. ఆ గుర్తింపు లేకుంటే ఆంధ్రప్రదేశ్‌లో చదివిన విద్యార్థులు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష రాయడం కుదరదని అంటున్నారు. అంతేకాకుండా ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరడానికి కూడా అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు ఖండించారు. ఇది వైద్యులు ముఖ్యంగా యువ వైద్యుల విద్యార్హతలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని ఆయన చెబుతున్నారు.
విదేశాల్లో ఉన్నత విద్య చదివే వారికి విద్యార్థతలు, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే నాటి సీఎం ఎన్టీఆర్ ఈ వర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన పేరు తొలగించడాన్ని ఖండించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.