Begin typing your search above and press return to search.
40 వేల డ్రగ్ .. నాలుగున్నర లక్ష .. రాష్ట్రంలో మెడికల్ మాఫియా దందా
By: Tupaki Desk | 30 April 2021 6:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతుంది. ఈ కరోనా ను అడ్డుకోవడానికే నానా తంటాలు పడుతున్న ఈ సమయంలో .. ఇదే అదునైన సమయంగా భావించి కొందరు మెడికల్ మాఫియాకి తెర తీశారట. క్రిటికల్ కండీషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లకు వాడే ఇంజక్షన్లను డ్రగ్ మాఫియా బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తోందట. గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా ఈ అక్రమ దందా సాగుతోందని ఓ ప్రముఖ ఛానెల్ ఓ కథనం ప్రసారం చేసిందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ న్యూస్ రాష్ట్రంలో గా మారింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పెరిగిపోవడంతో కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టే ఇంజక్షన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తమవాళ్లను రక్షించుకునేందుకు.. కుటుంబసభ్యులు ఏ డ్రగ్ అయినా, ఎంత డబ్బుపెట్టి కొనేందుకైనా సిద్ధమవుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు రెచ్చిపోతున్నారు. డ్రగ్ మాఫియాగా ఏర్పడి, అసలు ప్రజలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు , వారి అవసరాలు ఏంటి , ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీని కూడా అర్థం చేసుకోకుండా లక్షల్లో దోచుకుంటున్నారు. ఈ తరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో బయటపడిందని ఓ ప్రముఖ ఛానెల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. క్రిటికల్ కండీషన్ లో ఉన్నకరోనా పేషెంట్లకు ఇచ్చే, టొసిలిజుమాబ్ ఇంజక్షన్లు తమ దగ్గర ఉన్నాయంటూ బేరాలు ఆడుతున్నారు కేటుగాళ్లు. 40 వేలకు దొరికే డ్రగ్ ని , నాలుగున్నర లక్షలకు పైనే పెంచేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారట. కుటుంబ సభ్యుల ప్రాణాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టి కొనేందుకు రెడీ అయితే, టొసిలిజుమాబ్ లేదు, అలాంటిదే వేరే డ్రగ్ ఉందని చెబుతున్నారట. క్యాన్సర్ కి వాడే డ్రగ్‌ని కూడా, కోవిడ్‌కి వాడొచ్చని నమ్మిస్తున్నారట, టొసిలిజుమాబ్ కి బదులు సిజుమాబ్ అనే క్యాన్సర్ డ్రగ్ ని అంటగడుతున్నారని , ఈ ఇంజక్షన్ ఒరిజినల్ కాస్ట్ 43 వేలైతే, 3 లక్షల 70 వేలకు పైనే అమ్ముతున్నారనేది ఆ కథనం యొక్క ముఖ్య సారాంశం. గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ మెడికల్ మాఫియా దందా గురించి రాష్ట్రంలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయట. హైదరాబాద్ లో టొసిలిజుమాబ్ దొరకని వాళ్లను సైతం, గుంటూరుకు రప్పించి మరీ అమ్మేస్తోంది ఈ మాఫియా. టొసిలిజుమాబ్‌కి బదులు డ్రగ్ మాఫియా అంటగడుతున్న సిజుమాబ్ ఇంజక్షన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ తప్పవంటున్నారు వైద్య నిపుణులు. ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు.