Begin typing your search above and press return to search.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల చేతికి వైద్య నివేదిక!

By:  Tupaki Desk   |   17 Jun 2022 5:31 AM GMT
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల చేతికి వైద్య నివేదిక!
X
హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో రొమేనియన్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల వైద్య పరీక్షల నివేదిక పోలీసులకు అందింది. నాలుగు రోజుల క్రితం నిందితులకు పోలీసులు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించిన సంగతి తెలిసిందే. అయితే నిందితులందరికీ లైంగిక పటుత్వం ఉన్నట్టు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు.

ఈ నివేదికతోపాటు పోలీసులు మరికొన్ని ఆధారాలతో చార్జిషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలికపై అత్యాచారం చేసినప్పటి సీసీ ఫుటేజీతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సీడీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక‌ మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

నిందితుల కేశాలను, కార్లలో ఉన్న ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించారు. ఈ నివేదిక రావాల్సి ఉంది. అంతేగాక ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించనున్నారు. ఇవన్నీ కలిపి న్యాయ నిపుణుల సలహా తీసుకొని చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కాగా ఆరుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న మాలిక్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఐదుగురు మైనర్లు కూడా జువనైల్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దని జూబ్లీహిల్స్ పోలీసులు కౌంటర్ పిటిషన్ వేసే అవకాశముంది.

కాగా ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడితో సహా ప్రధాన నిందితుడు సాదుద్దీన్, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి జువైనల్ హోమ్ కు తరలించారు. ఆ తర్వాత తమ కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. నిందితులతో సీన్ రీకనస్ట్రక్షన్ కూడా చేయించారు. ఇందులో భాగంగా అత్యాచారం ఎవరు చేశారు? ఎవరు ముందు చేశారు? బాలిక మెడపై గాయాలు తదితర వివరాలన్నీ తెలుసుకున్నారు.

అలాగే అత్యాచారం వీడియోలను ఎవరు వైరల్ చేశారు? ఆ వీడియోలు తీసింది ఎవరు? సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వాటిని పెట్టింది ఎవరు వంటి వివరాలను పోలీసులు సేకరిస్తన్నారు. ఇప్పటికే ఆ వీడియోలు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు, యూట్యూబ్ కు పోలీసులు లేఖ రాశారు.