Begin typing your search above and press return to search.

కరోనాకు మందు - ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   22 March 2020 3:30 PM GMT
కరోనాకు మందు - ఎంతవరకు నిజం?
X
గత మూడు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యాధులు వచ్చాయి. కానీ అవేవీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ కరోనా ఒకవైపు ప్రాణాలు బలిగొంటూ మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అందుకే ఈ వైరస్ దాడికి గురయిన వారిని కాపాడుకుంటూనే మరోవైపు దానిపై యుద్ధం ప్రకటించింది ప్రపంచం. అనేక దేశాలు దీనికి మందు కనిపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఫ్రాన్స్ విజయం వైపు తొలి అడుగు వేసింది. ప్రస్తుతం యూరప్ మొత్తం ఈ వైరస్ తో అతలాకుతలం అవుతోంది. ఫ్రాన్స్ కూడా యూరప్ దేశమే.

ఇక మందు విషయానికి వస్తే ఫ్రాన్స్ కి చెందిన కనెక్సియోఫ్రాన్స్.కాం వెల్లడించిన దాని ప్రకారం ఫ్రెంచి పరిశోధకుడు డీజీర్ రౌల్ట్ దీనికి మందు కనిపెట్టినట్లు చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి తాను కనిపెట్టిన మందు ద్వారా ఆరు రోజుల్లో నయమైనట్లు ట్రయల్స్ ద్వారా తేలిందని ఆయన వెల్లడించారు.

మలేరియా మందుల్లో వాడే క్లోరోక్విన్ ఉపయోగించి చూడగా...మంచి ఫలితాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. అయితే .. దీని ఫలితం నిదానంగా కనిపించినా ఆరు రోజుల్లో మంచి ఫలితాలు చూశామన్నారు. రెండు నగరాలకు చెందిన కరోనా రోగులకు ప్రయోగాత్మకంగా ఈ ట్రీట్ మెంట్ చేసినట్లు చెప్పారు. ఈ మందును పది రోజుల పాటు 600 ఎంసీజీ మోతాదు ఇస్తూ వచ్చామన్నారు. మందు పాజిటివ్ ఫలితాలతో పాటు సైడ్ ఎఫెక్టులను (ఎందుకంటే ఈ మందు కొందరికి పడదు) కూడా అంచనా వేస్తూ పరిశీలించామని... కానీ ఇది మంచి ఫలితాలను ఇచ్చినట్లు ఆయన తేల్చారు.

ఇదిలా ఉండగా... చైనాలో కూడా క్లోరోక్విన్ ఫాస్పేట్, హైడ్రాక్సో క్లోరోక్విన్ కరోనా ట్రీట్ మెంట్ చేసినట్లు చెబుతున్నారు. అమెరికా పరిశోధకులు ఎయిడ్స్ వ్యాధికి ఉపయోగించే కాలెట్రా మందును ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపించాయని వార్తలు వెలువడ్డాయి. ఇది యాంటి రెట్రవైరల్ మెడికేషన్. కరోనా కూడా వైరస్. అందువల్లే కాలెట్రా వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.