Begin typing your search above and press return to search.

ఇది తాగితే మగాళ్ల వక్షోజాలు పెరుగుతాయట..

By:  Tupaki Desk   |   16 Aug 2019 10:30 AM IST
ఇది తాగితే మగాళ్ల వక్షోజాలు పెరుగుతాయట..
X
ఎలాగైనా సరే పదిమందిలో ప్రత్యేకంగా కనపడాలని పరితపించే యువత ఉన్న కాలమిదీ.. ముఖ్యంగా కాలేజీ యూత్ లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. మగాళ్లు ఇందుకోసం సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేస్తూ కండలు చూపిస్తుంటారు. ఇక అమ్మాయిలు జీరోసైజ్ లుక్ లో బంగారు తీగలా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు.

అయితే అమ్మాయిలు ఎంత అందంగా ఉన్న వక్షోజాలు ఉంటేనే సంపూర్ణ లేడీగా ఫీలవుతుంటారు. హీరోయిన్ల నుంచి సాధారణ మహిళల దాకా ఇప్పుడు వక్షోజాలు పెరగడం లేదు.. లేదా అనుకున్న స్థాయిలో లేవనే బాధ వారిని వెంటాడుతోంది. అయితే ఇప్పుడు హర్మోన్లు, ఇతర చికిత్సలతో వక్షోజాలు పెంచుకుంటున్నా అది కృతిమంగా కావడంతో సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి.

అందుకే సహజసిద్ధ పద్ధతుల్లో వక్షోజాలు పెరిగే దివ్య ఔషదాన్ని తాజాగా అమెరికా కాంప్ బెల్ వర్సీటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రజస్వల అయిన బాలికలు- యువతుల్లో వక్షోజాలు వేగంగా పెరగడానికి ‘‘లావెండర్ నూన్’’ బాగా ఉపయోగపడుతుందని తేల్చారు. లావెండర్ తో చేసిన ఉత్పత్తులు ఉపయోగించే బాలికల్లో రజస్వల కాకముందే చెస్ట్ విపరీతంగా పెరుగుతున్న తీరును వీరు గమనించారు. ఇక లావెండర్ వక్షోజాల పెరుగుదలకు తిరుగులేని మందుగా నిర్ధారించారు.

ఇక లావెండర్ వాడే అబ్బాయిల చాతి కూడా బాలికల రొమ్ము మాదిరిగా పెరుగుతోందని పరిశోధనలో షాకింగ్ ఫలితం వచ్చింది. ఈ లావెండర్ లోని ఈస్ట్రోజన్- టెస్టోస్టిరాన్ హర్మోనులపై ప్రభావం చూపి రొమ్ములు బాగా పెరగడానికి దోహదపడుతోందని పరిశోధకులు తేల్చారు.. సో అబ్బాయిలు ఈ లావెండర్ నూనెకు మీరు ఎంత దూరంగా ఉంటే అంతమంచింది. లేదంటే మీకు చెస్ట్ పెరిగి ఇబ్బందులకు గురికాక తప్పదు.